Arekapudi Gandhi: ఇవాళ కాంగ్రెస్ లో శేరిలింగంపల్లి బీఆరెస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ చేరారు. జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యేతో పాటు సీఎం సమక్షంలో పలువురు కార్పొరేటర్లు, అనుచరులు కాంగ్రెస్ లో చేరారు. శేరిలింగంపల్లి కార్పొరేటర్ నాగేందర్ యాదవ్, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాధ్ రెడ్డి, హైదర్ నగర్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్, తదితరులు కాంగ్రెస్ లో చేరారు. ఇప్పటికే 8 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. అరికెపూడి గాంధీ కాంగ్రెస్ లో చేరికతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్చ ఎనిమిది నుంచి తొమ్మిదికి చేరింది. ఇవాళ ఉదయం జూబ్లిహిల్స్ లోని సీఎం నివాసంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అరికపూడి గాంధీతో పాటు పలువురు కార్పోరేటర్లు, నేతలు కాంగ్రెస్ లో చేరుకోవడంతో సీఎం ఘనంగా పార్టీ కండువాకప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు.
Read also: Bihar : మొహర్రం ఊరేగింపులో పాలస్తీనా జెండా.. విచారణకు ఆదేశించిన అధికారులు
గత ఎన్నికల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి అరికెపూడి గాంధీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. అందుకే ఆయన కాంగ్రెస్ లో చేరడమే బెటర్ అని భావించినట్లు తెలుస్తోంది. మరో విషయం ఏంటంటే… ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ నేతలు జరిపిన చర్చలు సఫలమైనట్లు తెలుస్తోంది. వీరంతా కాంగ్రెస్‌లో చేరే తరుణం కోసం ఎదురుచూస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24 నుంచి జరగనున్నాయి. ఇప్పటిలోపు చేరికలు పూర్తి చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది.
Jammu and Kashmir: ఎన్నికల నేపథ్యంలో లెఫ్టినెంట్ గవర్నర్‌కు కేంద్రం మరిన్ని అధికారాలు