NTV Telugu Site icon

Hyderabad Crime: బేగంబజార్‌లో జంట హత్యలు.. ఘటనపై క్లారిటీ ఇచ్చిన అబిడ్స్ ఎసీపీ..

Begumbazar Crime

Begumbazar Crime

Hyderabad Crime: బేగంబజార్ పరిధిలోని తోప్ ఖానాలో దారుణం జరిగింది. ఓ భర్త తన భార్యపై అనుమానంతో గొంతు కోసి, కుమారుని గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం అతను ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈఘటన నగరంలో కలకలం రేపింది. దీంతో బేగంబజార్‌లో జంట హత్యల ఘటనపై అబిడ్స్ ఏసీపీ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. సిరాజ్‌ తన భార్య పిల్లలతో ఉత్తర ప్రదేశ్ నుంచి బ్రతుకు దేరువు కోసం 6 ఏళ్ళక్రితం హైదరాబాద్ వచ్చాడని అన్నారు. బేగంబజార్ లోని స్థానిక బ్యాంగిల్ స్టోర్ లో సిరాజ్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తాను పనిచేస్తున్న సమీప భవనంలో తొప్ ఖానాలో రెండు రోజులు క్రితం ఇల్లు కిరాయికి తీసుకున్నారు. సిరాజ్‌ రెండు సంవత్సరాలకు ఓసారి ఉత్తరప్రదేశ్ కు వెళ్తాడు. చివరి సారి 15 రోజులు ఉత్తరప్రదేశ్ సిరాజ్ ఉన్నాడని తెలిపారు.

Read also: CM Chandrababu: కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం.. రెండు రోజుల కాన్ఫరెన్స్‌లో ఏం జరిగిందంటే..?

అయితే తిరిగి వచ్చిన సిరాజ్‌ తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఈనేపథ్యంలోనే నిన్న రాత్రి నుండి బార్య భర్తల గొడవపడ్డారని తెలిపారు. భార్య ఏలియాపై అనుమానంతోనే సిరాజ్ హత్య చేసాడని ఏసీపీ అన్నారు. భార్య ఏలియాను కత్తితో గొంతు కోసి, చిన్న కొడుకు హైజాన్ గొంతు నలిపి చంపిన అనంతరం సిరాజ్ ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. పెద్ద కొడుకు అమెజాన్‌ను మాత్రం చంపకుండా వదిలేశాడని తెలిపారు. రాత్రి 4 గంటలకు పెద్దకొడుకు లేచి చూసేసరికి తల్లి, తమ్ముడు చనిపోయి ఉన్నారని అన్నారు. భయంతో పెద్దబాబు అమెజాన్‌ ఇంటి నుంచి బయటకు వచ్చి పైన నివాసముండే వ్యక్తులకు సమాచారం ఇచ్చాడు. దీంతో స్థానికులు 100 డయల్‌ ద్వారా సమాచారం ఇచ్చారని అన్నారు. ఘటనాస్థలంలో సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నమన్నారు. సిరాజ్ రాసిన సూసైడ్ నోట్ హిందీలో ఉందని అన్నారు. సూసైడ్ లో తల్లిదండ్రులకు క్షమాపణ కోరాడని, తమ మృతదేహాలను స్వస్థలానికి పంపించాలని పేర్కొన్నాడన్నారు. మృతదేహాలు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించామన్నారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని ఏసీపీ తెలిపారు.
Manchu Controversy : మీడియాకి క్షమాపణలు తెలిపిన మోహన్ బాబు