NTV Telugu Site icon

SHE Teams: బోనాల ఉత్సవాలు.. మహిళ పట్ల అసభ్య ప్రవర్తన చేసిన వారిపై కేసు నమోదు..

She Teem

She Teem

SHE Teams: ఆకతాయిల ఆగడాలకు హైదరాబాద్ పోలీసులు చెక్ పెడుతున్నారు. బోనాల ఉత్సవాల్లో మహిళ పట్ల అసభ్య ప్రవర్తన చేసిన వారిపై కేసు నమోదు చేశారు. ఆకతాయిల ఆగడాలకు చెక్ పెట్టారు. నగరంలో ఇటీవల జరిగిన బోనాల ఉత్సవాల సందర్భంగా.. మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వారిని అరెస్ట్‌ చేసేందుకు షీ టీమ్స్‌ రంగంలోకి దిగింది. 305 మంది వ్యక్తులను అదుపులో తీసుకున్నారు. వీరిలో 289 మంది పెద్దలు, 16 మంది మైనర్లు ఉండటం గమనార్హం. 173 మందికి వారి కుటుంబ సభ్యులతో పాటు కౌన్సెలింగ్ ఇచ్చిన షీ టీమ్స్‌.

Read also: KTR: తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవు.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ న్యాయపోరాటం..

ఐదుగురు వ్యక్తులను షీ టీమ్స్ పోలీసులు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మూడు రోజుల జైలు శిక్ష, రూ. 1050 జరిమానా విధించారు. జూలైలో మహిళలు, పిల్లలపై నేరాలకు సంబంధించిన 115 కేసులను స్వీకరించారు. వీటిలో 19 ఎఫ్‌ఐఆర్‌లు హైదరాబాద్‌లోని వివిధ పోలీస్ స్టేషన్‌లలో నమోదు చేశారు. 4 కేసులు పోక్సో చట్టం కింద నమోదు చేశారు. మరో 22 కేసులు వ్యక్తులు, వారి కుటుంబాల సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్‌ ఇచ్చారు. షీ టీమ్స్ ఫిర్యాదులలో ఎక్కువ కేసుల్లో అత్యాచారం, మోసం,వివాహం చేసుకుంటానుటూ మాయ మాటలు చెప్పడం వంటివి ఉండటం గమనార్హం.
Konda Surekha: వరంగల్ ఆసుప్రతిలో మరమ్మత్తులు జరపించండి.. కొండ సురేఖ ఆదేశం..

Show comments