Dussehra Holidays: తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు సర్కార్ శుభవార్త అందించింది. తాజాగా రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు దసరా పండుగ సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ ఏడాది దసరా సెలవులు 13 రోజులు. అంటే అక్టోబర్ 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. అక్టోబర్ 15 నుంచి పాఠశాలలు పున:ప్రారంభమవుతాయని విద్యాశాఖ ప్రకటించింది. అక్టోబర్ 2 గాంధీ జయంతి కావడంతో అప్పటి నుంచి బతుకమ్మ, దసరా సెలవులు ఉంటాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. లేకుంటే రాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలకు అక్టోబర్ 1 నుంచి సెలవులు ఇస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించగా.. అక్టోబరు 15న పునఃప్రారంభం అవుతుందని విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా సమాచారం అందించినట్లు తెలుస్తోంది.
దీంతో సెలవులు రాగానే అన్నీ విద్యార్థులు ఆనందంగా పట్టణాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కాగా.. రాష్ట్రంలో దసరా సెలవుల అనంతరం మళ్లీ విద్యాసంస్థలకు డిసెంబర్ 23 నుంచి 27 వరకు క్రిస్మస్ సెలవులు ఉంటాయని, ఆ తర్వాత వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని పేర్కొంది. ఏప్రిల్ 23, 2025 పాఠశాలలు కొనసాగుతాయని, ఆపై పదో తరగతి ప్రీ-ఫైనల్ పరీక్షలు ఫిబ్రవరి 28 నాటికి పూర్తవుతాయని తెలిపింది. పదో తరగతి వార్షిక పరీక్షలు 2025 మార్చిలో నిర్వహిస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
Top Headlines @9AM : టాప్ న్యూస్