NTV Telugu Site icon

Hyderabad Thief: సీఎం వస్తే నేను లొంగిపోతా.. దొంగ డిమాండ్ కు పోలీసుల రియాక్షన్

Tife

Tife

Hyderabad Thief: తాళం వేసిన ఇంటిలో చోరీ చేశాడు. దొంగను గమనించిన స్థానికులు పట్టుకోవడానికి ప్రయత్నించడంతో.. తప్పించుకునేందుకు దొంగ చేరువులో దూకాడు. అయితే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో.. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించిన ఫలితం కనపడలేదు. ఎందుకంటే దొంగ చెరువు మధ్యలో వుండి నేను రానంటూ మెరాయించాడు. అంతేకాదు తను పోలీసులకు పట్టుబడాలంటే సీఎం రేవంత్ రెడ్డి రావాలని డిమాండ్ చేశాడు. ఈ వింత ఘటన మేడ్చల్ జిల్లా సూరారం ఠానాలో చోటుచేసుకుంది.

మేడ్చల్ జిల్లా సూరారం ఠానాలోని శివాలయనగరల్ లో నాగలక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. నిన్న సాయంత్రం 4.30 గంటలకు ఇంటికి తాళం వేసి ఫంక్షన్ కి వెళ్లారు. అయితే రెండవ కుమార్తె సాయిజ్యోతి ఇంటికి దగ్గరకు వచ్చి షాక్ కు గురైంది. ఇంటి తలపులు తెరచి ఉండడం చూసి లోనికి వెళ్లింది. తాళం నాదగ్గరే ఉంది. ఇంట్లో ఎవరు వచ్చారంటూ మెల్లగా లోనికి వెళ్లింది. అయితే ఇళ్లంతా బట్టలు పడివున్నాయి. లోపల వెళ్లి చూస్తే బీరువా ముందు ఓ వ్యక్తి కూర్చొనొ డబ్బులు లెక్కపెడుతూ కనిపించాడు. అంతే సాయిజ్యోత నిర్ఘాంతపోయింది. దొంగ.. దొంగ అని అరుస్తూ ఇంట్లోనుంచి బయటకు పరుగులు పెట్టింది. దీంతో స్థానికులు పరుగున వచ్చారు. దీంతో భయాందోళనకు గురైన దొంగ తనను ఎక్కడ పట్టుకుంటారో అని బయటకు పరుగులు పెట్టాడు.

ఆ వ్యక్తిని స్థానికులు వెంబడించారు. అయితే ఎంత పరుగులు పెట్టిన స్థానికులు వెంబడించడంతో గత్యంతరం లేక పక్కనే వున్నా పెద్ద చెరువలోకి దిగి అందులో వున్న ఒక చిన్న గుట్టపై నిలబడ్డాడు. అయితే స్థానికులు ఎస్సై వెంకటేష్ కు సమాచారం ఇవ్వడంతో హుటా హుటిన పోలీసులు అక్కడకు చేరుకున్నారు. దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించగా అక్కడి నుంచి మళ్లీ చెరువులో దూకి పారిపోతాడేమో అనే ఆలోచనతో బుజ్జగించారు.. రేయ్ రారా అంటూ బతిమలాడినా నేను రాను అంటూ దొంగ మెరాయించాడు. సీఎం రేవంత్ రెడ్డి వచ్చేంత వరకు గట్టుమీదకు రానంటూ డిమాండ్ చేశాడు. దీంతో సాయంత్రం 5 గంటల నుంచి దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించిన ఫలితం అంతా వృధాగానే మిగిలింది.. అర్థ రాత్రి అంత చలిలో కూడా దొంగకోసం పోలీసులు పడిగాపులు కాయాల్సి వచ్చింది.

High-Speed Flying-Wing UAV: భారత్ హై-స్పీడ్ ఫ్లయింగ్ వింగ్ యూఏవీ టెస్టింగ్ సక్సెస్