కర్ణాటకకు చెందిన బీజేపీ సీనియర్ నేత శైలేంద్ర పై హైదరాబాద్ లో కేసు నమోదు చేశారు పోలీసులు.. కర్ణాటక నుంచి పెద్ద మొత్తంలో గుట్కా తయారీదారులకు మద్దతిస్తున్నారని ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు నమోదు చేశారు.. షాహినాజ్‌గంజ్ పీఎస్ లో శైలేంద్ర తో పాటు బీజేపీ చెందిన మరో ముఖ్య నాయకుల పై కేసు నమోదైంది.. కర్ణాటక సీఎం ఎడ్యూరప్పకి అత్యంత సన్నిహితుడిగా శైలేంద్ర.. కర్ణాటక ఇండస్ట్రీ కార్పొరేషన్ చైర్మన్‌గా కూడా కొనసాగుతున్నారు. బీదర్ నుంచి వస్తున్న గుట్కా మాఫియాకి అండగా ఉంటున్నారని.. హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పెద్ద ఎత్తున గుట్కా మాఫియా నడుపుతున్నారని అభియోగాలున్నాయి.. షాహినాజ్ గంజ్ పీఎస్ పరిధిలో భారీ ఎత్తున్న గుట్కా పట్టుబడగా.. ఈ కేసులో విచారణకు రావాలని బీదర్ కు చెందిన ముగ్గురికి నోటీసులు జారీ చేశారు పోలీసులు..
గుట్కా కేసు.. బీజేపీ నేత, సీఎం సన్నిహితుడికి నోటీసులు..!

gutka