NTV Telugu Site icon

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోకు రూ. 10 వేలు ఫైన్.. అలా చేశారు అందుకే వేశారు..!

Hyderabad Metro

Hyderabad Metro

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో కార్పొరేషన్ కు ఖమ్మం జిల్లా వినియోగదారుల కమిషన్ రూ.10వేలు జరిమానా విధించింది. మెట్రో స్టేషన్‌లో రూ. 10. అదనంగా వసూలు చేశారన్న ఫిర్యాదుపై విచారణ చేపట్టిన కమిషన్ ఈ మేరకు జరిమానా విధించింది. మెట్రో రైల్వే స్టేషన్‌లో ఒకవైపు నుంచి మరో వైపుకు ప్రయాణించేటప్పుడు ప్రయాణికుల నుంచి అదనంగా వసూలు చేసిన రూ.10ని వాపసు ఇవ్వాలని మెట్రో సంస్థను ఆదేశించింది.

Read also: Khairatabad-Balapur Ganesh Live Updates: ఖైరతాబాద్‌-బాలాపూర్‌ నిమజ్జన అప్డేట్‌

ఖమ్మం జిల్లాకు చెందిన న్యాయవాది వెల్లంపల్లి నరేంద్ర స్వరూప్ 2019 జనవరి 18న మెట్రోలో ప్రయాణించేందుకు ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్‌కు వెళ్లగా, మెట్రో రైలుకు తూర్పు వైపు టాయిలెట్‌లు లేకపోవడంతో మరో వైపు టాయిలెట్‌లోకి వెళ్లాడు. . అందుకు మెట్రో రైల్వే జారీ చేసిన ట్రావెల్ కార్డును స్టేషన్‌లో స్వైప్ చేశాడు. అయితే.. అదే స్టేషన్ లో ఒక పైపు నుంచి మరో వైపు వెళ్లేందుకు రూ. ట్రావెల్ కార్డు నుంచి 10 కట్‌ కావడంతో సిబ్బందిని ఆపేశాడు. ప్రయాణం చేయకుండా డబ్బులు ఎలా కట్ చేస్తారని ప్రశ్నించారు. దానికి మెట్రో సిబ్బంది సరైన సమాధానం చెప్పలేదు. దీనిపై ఖమ్మంలోని వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇరువైపులా మరుగుదొడ్లు ఏర్పాటు చేయకపోవడంతో తన వద్ద రూ. 10 అదనంగా వసూలు చేసి, మెట్రో సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై ఖమ్మం జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ చైర్మన్ లలిత, సభ్యురాలు ఎ.మాధవీలత మంగళవారం విచారణ చేపట్టారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి రూ. 5 వేలు, కోర్టు ఖర్చు మరో రూ.5 వేలు 45 రోజుల్లోగా కట్టాలని కమీషన్ మెట్రో సంస్థను ఆదేశించింది. ప్రయాణికుల సౌకర్యార్థం డిస్ ప్లే బోర్డులు పెట్టాలని ఆదేశించారు.
Narendra Modi: పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి.. ప్లీజ్ సబ్‌స్రైబ్ మై ఛానల్