NTV Telugu Site icon

KCR Congratulates Nikhat Zareen: నిఖత్ జరీన్‌ కు అర్జున అవార్డు.. అభినందించిన కేసీఆర్

Kcr Congratulates Nikhat Zareen

Kcr Congratulates Nikhat Zareen

KCR Congratulates Nikhat Zareen: ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్‌ను ప్రతిష్టాత్మక ‘అర్జున అవార్డు’కు ఎంపిక చేయడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల భారత ప్రభుత్వం ఇతర క్రీడా అవార్డులలో ప్రతిష్టాత్మక అవార్డుకు నిఖత్ జరీన్‌ను ఎంపిక చేసింది. నవంబర్ 14వ తేదీన యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ బాక్సర్ నిఖత్ జరీన్‌ను అర్జున అవార్డుకు ప్రకటించింది. క్రీడా రంగంలో అర్జున అవార్డులకు ఎంపికైన 25 మందిలో ఆమె కూడా ఉన్నారు. మహిళల బాక్సింగ్‌లో వరుస విజయాలు నమోదు చేసి దేశానికే గుర్తింపు తెచ్చిన నిఖత్ జరీన్ అర్జున అవార్డుకు అర్హురాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నవంబర్ 16న అధికారిక ప్రకటనలో తెలిపారు. తెలంగాణకు చెందిన ఈ క్రీడాకారునిని చూసి యావత్ దేశం గర్విస్తోందని అన్నారు.

Read also: 15 New Fire Stations: రాష్ట్రంలో 15 అగ్నిమాపక కేంద్రాలు.. తెలంగాణ ప్రభుత్వం ఆమోదం

నిఖత్ జరీన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లతో పాటు కామన్ వెల్త్ గేమ్స్ (CWG) 2022లో స్వర్ణం గెలుచుకుంది. నామినీలు నవంబర్ 30, 2022న రాష్ట్రపతి భవన్‌లో జరిగే కార్యక్రమంలో భారత రాష్ట్రపతి నుండి అవార్డులను అందుకుంటారు. 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల 50 కిలోల లైట్ ఫ్లై వెయిట్ విభాగంలో భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించిన నిఖత్ జరీన్ ఇప్పుడు 2024 పారిస్ ఒలింపిక్ గేమ్స్‌లో బంగారు పతకం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. నిఖత్ జరీన్ 26 ఏళ్ల బాక్సర్ తెలంగాణలోని నిజామాబాద్ నగరానికి చెందినవారు. ఆమె పాఠశాల విద్యను నిర్మల హృదయ బాలికల ఉన్నత పాఠశాలలో పూర్తి చేసింది. కొన్నేళ్ల క్రితం, హైదరాబాద్‌లోని ఏసీ గార్డ్స్‌లో ఉన్న బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమెను స్టాఫ్ ఆఫీసర్‌గా నియమించింది. 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకం కాకుండా, బాక్సర్ 2014 యూత్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం, 2019 స్ట్రాండ్జా మెమోరియల్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో బంగారు పతకం మొదలైన అనేక ఇతర పతకాలను గెలుచుకున్నారు.
15 New Fire Stations: రాష్ట్రంలో 15 అగ్నిమాపక కేంద్రాలు.. తెలంగాణ ప్రభుత్వం ఆమోదం