Cab Drivers Protest: విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ లో రవాణా వ్యవస్థ మరింతగా అభివృద్ధి చెందుతోంది. అయితే.. శంషాబాద్ విమానాశ్రయం నుంచి నగరానికి.. నగరం నుంచి విమానాశ్రయానికి.. ఆ మార్గంలో క్యాబ్‌ల వినియోగం పెరిగింది. అదే స్థాయిలో క్యాబ్‌ల సంఖ్య కూడా పెరిగింది. ప్రయాణికుల రద్దీ, క్యాబ్‌ల మధ్య పోటీని దృష్టిలో ఉంచుకుని ఓలా, ఉబర్ వంటి ప్రైవేట్ క్యాబ్ కంపెనీలు తక్కువ ఛార్జీలను నిర్ణయిస్తున్నాయి. ఇలా తక్కువ ధరల వల్ల క్యాబ్ డ్రైవర్లు సంపాదనకు నోచుకోవడం లేదు. యాప్స్‌లో చూపిన ధరలకే రావాలని ప్రయాణికులు కోరుతున్నారని.. ఆ ధరలకు వాహనాలు నడపడం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలకు కూడా సరిపోవడం లేదని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో.. క్యాబ్వాలాలు కొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఎయిర్‌పోర్టు ప్రయాణికులకు క్యాబ్ సర్వీసులను నిలిపివేస్తూ.. ‘తక్కువ ధర.. గాలి లేదు’ అంటూ నిరసనకు దిగారు. దీంతో సమయానికి క్యాబ్‌లు అందుబాటులో లేక.. సర్వీసులు బుక్ చేసినా.. డ్రైవర్లు నిరాకరించడంతో విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Read also: World Cup 2023: అమితాబ్ బచ్చన్‌కు ‘గోల్డెన్ టికెట్’.. అన్ని మ్యాచ్‌లు ఫ్రీ!
సమయానికి క్యాబ్‌లు అందుబాటులో లేకపోవడంతో గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి రోజుకు 65 వేల మంది జాతీయ, అంతర్జాతీయ ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. విమానాశ్రయంలో ఆర్టీసీ పుష్పక్ బస్సులు, ప్రీపెయిడ్ ట్యాక్సీలు, ప్రైవేట్ వాహనాలే కాకుండా దాదాపు 5 వేల క్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే గత కొంత కాలంగా విమానాశ్రయం నుంచి 50 కిలోమీటర్ల లోపు ఎక్కడికి వెళ్లినా రూ.500 నుంచి రూ.700 మాత్రమే లభిస్తోంది. వచ్చిన డబ్బులో ఓలా, ఉబర్ 30 శాతం వరకు కమీషన్ ఇవ్వాల్సి ఉంటుంది. పెట్రోలు, డీజిల్ ఖర్చులకే డబ్బులు సరిపోవడం లేదని డ్రైవర్లు వాపోతున్నారు. విమానాశ్రయం నుంచి ప్రభుత్వం నడుపుతున్న ప్రీపెయిడ్ ట్యాక్సీలకు ఒక్కో ట్రిప్పుకు రూ.980 నుంచి రూ.1150 వరకు లభిస్తుండగా, అతి తక్కువ ఆదాయం వస్తోందన్నారు. దీంతో ఎయిర్ పోర్టుకు క్యాబ్ లను నడపడానికి నిరాకరిస్తున్నారని.. తెలంగాణ గ్రిగ్ అండ్ ట్యాక్సీ డ్రైవర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ తెలిపారు. అగ్రిగేటర్ కంపెనీలకు ఇచ్చే కమీషన్‌ను 30 శాతం నుంచి 15 శాతానికి తగ్గించాలని క్యాబ్ డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు.
World Cup 2023: తొలిసారి వన్డే ప్రపంచకప్ ఆడనున్న 6 భారత ఆటగాళ్లు.. లిస్టులో హైదరాబాద్ ప్లేయర్! తుది జట్టులో చోటెవరికంటే