Challan: తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ట్రాఫిక్ పెండింగ్ చలాన్ డిస్కౌంట్ ఆఫర్‌కు వాహనదారుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. డిసెంబర్ 26న ఈ ఆఫర్ అమల్లోకి రాగా, మూడు రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 9.61 లక్షల చలాన్లు క్లియర్ అయ్యాయి. వీటి ద్వారా రూ.8.44 కోట్ల ఆదాయం సమకూరినట్లు రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. ఒక్క హైదరాబాద్ లోనే 3.54 లక్షల చలాన్ల ద్వారా 2.62 కోట్లు వసూలు అయ్యాయి. అంతేకాకుండా.. సైబరాబాద్ పరిధిలో 1.82 లక్షల చలాన్ల ద్వారా 80 లక్షలు వసూలు చేశారు. ఇక రాచకొండ పరిధిలో 93 వేల చలాన్లకు గాను 76.79 లక్షల ఆదాయం సమకూరినట్లు అధికారులు వివరించారు. రాయితీ ఆఫర్‌ను పొందేందుకు వాహనదారులు భారీగా చెల్లింపులు చేయడంతో ట్రాఫిక్ చలాన్ సర్వర్ వేలాడుతోంది. దీన్నిబట్టి మీకే అర్థమవుతుంది.. అయితే.. చెల్లింపులు అధికంగా ఉంటున్న నేపథ్యంలో సర్వర్ తరచూ మొరాయిస్తున్నట్లు వాహనదారులు తెలిపారు.
Read also: Devil Movie Review: కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ మూవీ రివ్యూ!
కాగా, పెండింగ్‌లో ఉన్న చలాన్లను వసూలు చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు ఈ తగ్గింపు ఆఫర్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. గతేడాది కూడా ఈ ఆఫర్ ప్రకటించగానే.. పెండింగ్ చలాన్ల ద్వారా 300 కోట్ల ఆదాయం సమకూరింది. అయితే ఈ ఏడాది కూడా దాదాపు 2 కోట్ల చలాన్లు పెండింగ్‌లో ఉండడంతో వాటిని క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు మళ్లీ ఈ ఆఫర్ తీసుకొచ్చారు. డిసెంబర్ 26న ఈ ఆఫర్ ప్రారంభం కాగా, జనవరి 10 వరకు తగ్గింపుతో పెండింగ్‌లో ఉన్న చలాన్‌లను చెల్లించేందుకు ట్రాఫిక్ పోలీసులు అవకాశం కల్పించారు.అయితే.. డిసెంబర్ 25లోపు చెల్లించిన చలాన్‌లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఆ తర్వాత వచ్చే టోల్‌లో 100 శాతం చెల్లించాల్సిందేనని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు.
CM Revanth Reddy: రేవంత్ రెడ్డి తొలి విదేశీ పర్యటన ఖరారు.. దావోస్ వెళ్లనున్న సీఎం