NTV Telugu Site icon

Manjeera floods: ఏడుపాయల వనదుర్గ ఆలయం వద్ద వరద ప్రవాహం.. ఆలయాన్ని మూసివేసిన అధికారులు

Manjeera Floods

Manjeera Floods

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న (శుక్రవారం) ఉదయం నుంచి రాత్రి వరకు భాగ్యనగరం సహా పలు జిల్లాల్లో భారీగా వానలు పడ్డాయి. నగరవాసులతంగా ఇంకా ఐదురోజుల పాటు అప్రమత్తంగా వుండాలని హైదరాబాద్‌ వాతావరణ శాఖ హెచ్చరించింది. గ్రేటర్‌ నగరంతో పాటు మహబూబ్‌ నగర్‌, జనగామ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో రెడ్డ అలర్ట్‌ ఉంటుందని ప్రకటించింది. కాగా.. 4 రోజులు అక్కడక్కడా కుంభవృష్టి కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు డాక్టర్‌ నాగరత్న వెల్లడించారు. ఈనేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకపోవడం మంచిదని సూచించారు. ఇక మరోవైపు రాష్ట్రంలో వానలు విజృంభించడంతో వాగులు వంకలు, ప్రాజెక్టులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.

ఎగువన కురుసిన వర్షాలకు సింగూరు ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో గేట్లు ఎత్తివేశారు అధికారులు. సింగూరు ప్రాజెక్ట్‌ నాలుగు గెట్లను ఎత్తి వేసి దిగువకు నీటిని విడుదల చేయడంతో మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మెదక్‌ జిల్లాలోని ఏడుపాయల వన దుర్గ మాత ఆలయం వద్ద వరద నీరు ప్రవహిస్తోంది. ఆలయంలోకి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో. ఆలయం మూసివేసారు అధికారులు. రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా మెదక్ జిల్లా కలెక్టర్ ఈరోజు మెదక్ జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలు లోకల్ హాలిడే ప్రకటించారు.

Delhi: ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో దారుణం.. 30 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం