Record electricity: రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. రాష్ట్ర చరిత్రలో ఈ శుక్రవారం విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయికి చేరుకుంది. సాయంత్రం 4.08 గంటలకు 14,169 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. దీంతో కరెంట్ చుక్కలను తాకుతుంది.
Read also: Lalu Prasad Yadav: భారత్‌కు లాలూ ప్రసాద్ యాదవ్.. కూతురు ఎమోషనల్ ట్వీట్
తెలంగాణలో విద్యుత్ ఆల్ టైం రికార్డ్ సృష్టించింది. రాష్ట్రంలో నిన్నటి కంటే ఇవాళ అత్యధిక విద్యుత్ డిమాండ్ అమాంతంగా పెరిగింది. ఉదయం 10 గంటల వరకు 14350 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమైదుకాగా.. నిన్న సాయంత్రం 4గంటల వరకు 14169 గా నమోదైంది. గత ఏడాది ఇదే రోజున 11420 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదుకాగా.. మే నెల వరకు 15000 మెగావాట్ల వరకు చేరే అవకాశం వుందని విశ్వసనీయ సమాచారం. ఇంకా వేసవికాలం మొదలుకాకముందే.. విద్యుత్తు వాడకం చుక్కలను తాకుతోంది. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా శుక్రవారం సాయంత్రం 4.08 గంటలకు 14,169 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. గతేడాది ఫిబ్రవరి 10న కేవలం 11,822 మెగావాట్ల డిమాండ్ మాత్రమే ఉంది.
Read also: Banda Prakash: శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నిక.. నామినేషన్ వేయనున్న బండా ప్రకాష్
గతంలో అత్యధిక రోజువారీ వినియోగం 2022 మార్చి 29న 14,167 మెగావాట్లు నమోదుకాగా.. తాజా ఈరికార్డు బద్దలైంది. యాసంగి పంటల సాగు విస్తీర్ణం విపరీతంగా పెరగడంతో వ్యవసాయ బోరుబావుల వినియోగం పెరుగుతోందని, డిమాండ్ శిఖరాగ్రానికి చేరుతోందని విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) వెల్లడించాయి. కొద్దిరోజులుగా వ్యవసాయ బోర్లకు 10 గంటల్లో త్రీఫేజ్ కరెంటు ఇస్తున్నారు. శుక్రవారం నుంచి 12 గంటల నుంచి సరఫరా పెరగడంతో డిమాండ్ కూడా పెరుగుతోంది. శనివారం నుంచి వ్యవసాయ బోర్లకు 24 గంటల త్రీఫేజ్ సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గరిష్టంగా 15 వేల మెగావాట్లకు మించి డిమాండ్ ఉండవచ్చని డిస్కమ్ లు అంచనా వేస్తున్నాయి.
Telangana Budget: నేటితో బడ్డెట్ పద్దులపై శాసనసభలో ముగియనున్న చర్చ