Site icon NTV Telugu

High Temperatures: మెుదటి వారంలోనే భానుడి భగభగలు.. ఫిబ్రవరిలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు

High Tempurechur In Telangana

High Tempurechur In Telangana

High Temperatures: మార్చి నెల నుంచి దాదాపు ఎండలు మొదలవుతాయి. ఏప్రిల్, మే నెలల్లో ఎండలు ఎక్కువగా ఉంటాయి. తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. మంగళవారం ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఏడాది ఉష్ణోగ్రతల్లో ఇదే గరిష్ఠ పెరుగుదల కావడం గమనార్హం. ఫిబ్రవరి మొదటి వారంలో ఆదిలాబాద్‌లో 31.5 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. కానీ మంగళవారం 4.5 డిగ్రీలు పెరిగి 36 డిగ్రీలకు చేరుకుంది. ఖమ్మంలో 31 డిగ్రీలు ఉండాల్సి ఉండగా 35 డిగ్రీలకు చేరింది.

Read also: AP Assembly: అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్

హైదరాబాద్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. మంగళవారం ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3.7 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. మహబూబ్‌నగర్‌లో 2.9, నిజామాబాద్‌లో 2.8, మెదక్‌లో 2.2, రామగుండంలో 2.1, హనుమకొండలో 1.9, భద్రాచలంలో 1.5 డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పగటిపూటనే కాకుండా రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, రామగుండం, హైదరాబాద్‌లలో సోమవారం (ఫిబ్రవరి 05) రాత్రి సాధారణం కంటే 4 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఫిబ్రవరి మొదటి వారంలోనే ఎండల తీవ్రత ఇలా ఉంటే ఎండాకాలం పూర్తిగా ప్రారంభమైతే ఎలా ఉంటుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
Kumari Aunty: స్టార్‌మా షోకు స్పెష‌ల్ గెస్ట్‌గా ‘కుమారి ఆంటీ’.. బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌కు నాన్ వెజ్ వంటలు!

Exit mobile version