NTV Telugu Site icon

Hyderabad Old City: పాతబస్తీలో హై టెన్షన్.. రంగంలోకి ఆర్ఏఎఫ్ బలగాలు

Rapid Action Force Hyderaba

Rapid Action Force Hyderaba

High Security Alert In Hyderabad Old City Over Raja Singh Issue: ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై హైదరాబాద్ పాతబస్తీలో ఇంకా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. చార్మీనార్, మదీనా, చాంద్రాయణగుట్ట, బార్కాస్, సిటీ కాలేజ్ తదితర ప్రాంతాల్లో.. రాజాసింగ్‌ని అరెస్ట్ చేయాలంటూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలోనే పాతబస్తీలో భారీగా పోలీసుల్ని మోహరించారు. ఆందోళనకు దిగిన 31 మందిని, అలాగే సాయంత్రం ర్యాలీగా వచ్చిన మరో 20 మంది ఆందోళనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుకాణాలన్నీ మూతపడగా.. పలుచోట్ల పెట్రోల్ బంక్స్‌ని మూసివేశారు.

ఉదయం శాలిబండలో ఆందోళన చోటు చేసుకున్న తరుణంలో.. ముందస్తుగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను పోలీసులు రంగంలోకి దింపారు. మీర్‌చౌక్, చార్మినార్, గోషామహల్ జోన్ల పరిధిలో మొత్తం 360 మంది ఆఫ్ఏఎఫ్ బలగాలు విధుల్లో ఉన్నాయి. సమస్యాత్మక ప్రాంతాల్ని గుర్తించి, అక్కడ భారీగా బలగాల్ని మోహరించారు. సాయంత్రం 7 గంటల వరకూ అన్నింటినీ బంద్ చేయాలని పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. వదంతులు నమ్మొద్దని సూచించిన పోలీసులు.. ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. ఎవరైనా ర్యాలీలు నిర్వహిస్తే.. కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. పాతబస్తీలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. కాగా.. నగరంలోని ఆందోళనలపై సీఎం కేసీఆర్ రివ్యూ నిర్వహించారు. దాదాపు మూడు గంటలపాటు ఉన్నతాధికారులతో సమీక్షించారు.

ట్రాఫిక్ ఆంక్షలు ఇలా ఉన్నాయి:

* పురానాపూల్ బ్రిడ్జి, ఎంజే బ్రిడ్జ్ నుండి ఓల్డ్ సిటీ, మలక్‌పేట్ & LB నగర్ వైపు వెళ్లడానికి ఉద్దేశించిన సాధారణ ట్రాఫిక్ అనుమతించబడదు. నయాపూల్ బ్రిడ్జి, శివాజీ బ్రిడ్జి, చాదర్‌ఘాట్ వంతెన, చాదర్‌ఘాట్ కాజ్ వే మరియు మూసారాంబాగ్ వంతెన మరియు ట్రాఫిక్‌ను ఇతర ప్రత్యామ్నాయ మార్గాల్లో అవసరాన్ని బట్టి మళ్లిస్తారు.

* ఎంజే మార్కెట్ నుంచి నయాపూల్ బ్రిడ్జి, ఎంజే బ్రిడ్జి, పురానాపూల్ బ్రిడ్జి మీదుగా ఓల్డ్ సిటీ వైపు వచ్చే ట్రాఫిక్‌ను 100 అడుగుల రోడ్డు, జియాగూడ, రాంసింగ్‌పురా, అత్తాపూర్, ఆరామ్‌గఢ్, మైలార్‌దేవ్‌పల్లి, చాంద్రాయణగుట్ట వైపు మళ్లిస్తారు.

* ఎంజే మార్కెట్ నుంచి నయాపూల్ బ్రిడ్జి, శివాజీ బ్రిడ్జి మీదుగా పాతబస్తీకి వెళ్లే ట్రాఫిక్‌ను రంగమహల్, చాదర్‌ఘాట్, నింబోలియాడ్డ, టూరిస్ట్ జంక్షన్, బర్కత్‌పురా, ఫీవర్ హాస్పిటల్, విద్యానగర్, తార్నాక వైపు మళ్లిస్తారు.

* అబిడ్స్‌, కోటి వైపు నుంచి చాదర్‌ఘాట్‌ వంతెన, చాదర్‌ఘాట్‌ కాజ్‌ వే, మూసారాంబాగ్‌ వంతెన మీదుగా మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్‌బీనగర్‌ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను నింబోలియాడ్డ, టూరిస్ట్‌ జంక్షన్‌, బర్కత్‌పురా, ఫీవర్‌ హాస్పిటల్‌, విద్యానగర్‌, తార్నాక లేదా 6 నంబర్‌ జూ. రామంతాపూర్‌ వైపు మళ్లిస్తారు.

* పాతబస్తీ నుంచి నయాపూల్ బ్రిడ్జి, ఎంజే బ్రిడ్జి, పురానాపూల్ బ్రిడ్జి మీదుగా అబిడ్స్, కోటి, ఎంజే మార్కెట్, లక్డీకాపూల్ వైపు వెళ్లే వాహనాలను దారి మళ్లిస్తామని, చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి, అరమ్‌గఢ్, అత్తాపూర్, మెహదీకపట్నం, మల్కదబ్తాన్‌పట్నం వైపు వెళ్లే ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లాలని కోరారు.

* దిల్‌సుఖ్‌నగర్ మరియు ఎల్‌బి నగర్ నుండి మూసారాంబాగ్, చాదర్‌ఘాట్, ఎస్‌జె బ్రిడ్జ్ మీదుగా అబిడ్స్, కోటి, ఎంజె మార్కెట్ వైపు వెళ్లే ట్రాఫిక్ ఉప్పల్, తార్నాక, విద్యానగర్, ఫీవర్ హాస్పిటల్, బర్కత్‌పురా నుండి వెళ్తుంది.

* పాతబస్తీ వైపు విగ్రహాలు 100 అడుగుల రోడ్డు, జియాగూడ, రాంసింగ్‌పురా, అత్తాపూర్, ఆరామగఢ్, మైలార్‌దేవ్‌పల్లి, చాంద్రాయణగుట్ట మీదుగా పాతబస్తీలోకి ప్రవేశిస్తాయి.

* అఫ్జల్‌గంజ్, సిబిఎస్, రాగ్‌మహల్, చాదర్‌ఘాట్, నింబోలియాడ్డ, బర్కత్‌పురా, ఫీవర్ హాస్పిటల్, విద్యానగర్, తనకా, హబ్సిగూడ ఉప్పల్, ఎల్‌బి నగర్ మీదుగా ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్ & ఎల్‌బి నగర్ వైపు విగ్రహాలు వెళ్తాయి.