NTV Telugu Site icon

Dr Preethi suicide case: పీజీ విద్యార్థి సస్పెన్షన్‌ రద్దు.. హైకోర్టు ఉత్తర్వులు

Warangal

Warangal

Dr Preethi suicide case: వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ)లో పీజీ మొదటి సంవత్సరం చదువుతున్న ధరావత్ ప్రీతి గతేడాది ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. సీనియర్ విద్యార్థిని వేధింపులతో ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఆమె ఆత్మహత్య కేసు మరోసారి తెరపైకి రావడంతో ఏం జరుగుతుంది అన్నట్లు విద్యార్థులు ఆతృతగా ఎదురుచూశారు.. ప్రీతి ఆత్మహత్య కేసులో విచారణ జరుపుతున్న సైఫ్ పై వచ్చిన ఆరోపణలపై యాంటీ ర్యాగింగ్ కమిటీ కీలక విషయాలను వెల్లడించింది. సైఫ్, ప్రీతీని వేధింపులకు గురిచేసంది నిజమేనని కమిటీ తేల్చింది.

Read also: Satavahana Express Train: శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లో పొగలు.. భయంతో ప్రయాణికులు పరుగులు

సైఫ్‌పై గతంలో విధించిన సస్పెన్షన్ గడువు ఈ ఏడాది మార్చి 3తో ముగియగా, దానిని మరో 97 రోజులు పొడిగిస్తున్నట్లు తాజాగా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ధరావత్ ప్రీతి ఆత్మహత్య కేసులో యాంటీ ర్యాగింగ్ కమిటీ తీర్మానాన్ని రద్దు చేస్తూ హైకోర్టు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కేఎంసీలో అనస్థీషియా ద్వితీయ సంవత్సరం విద్యార్థి సైఫ్ అలీ అభ్యర్థన మేరకు కోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు ర్యాగింగ్ నిరోధక కమిటీ మళ్లీ విచారణ చేపట్టింది. ఇందులో నిందితులపై వచ్చిన ఆరోపణలు నిజమేనని భావించిన కమిటీ గత నిర్ణయాన్ని సమర్థిస్తూ సస్పెన్షన్ వేటును కోర్టుకు అప్పగించింది. కమిటీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సైఫ్ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన వాదనను సమర్థించిన కోర్టు ర్యాగింగ్ నిరోధక కమిటీ తీర్మానాన్ని రద్దు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
Satavahana Express Train: శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లో పొగలు.. భయంతో ప్రయాణికులు పరుగులు