Site icon NTV Telugu

సరూర్ నగర్ లో హైటెక్ తరహా లో పరీక్ష కాపీ…

సరూర్ నగర్ లో హైటెక్ తరహా లో పరీక్ష కాపీ కొడుతున్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలతో పరిక్ష రాసేందుకు ప్రయత్నం చేసి… అడ్డంగా బుక్ అయ్యాడు హర్యణా యువకుడు సౌరభ్. వాయుసేన లో ఎయిర్ మెన్ ఆన్ లైన్ పరిక్ష కోసం హైదరాబాద్ నగరానికి వచ్చాడు సౌరభ్. అతనికి కర్మాణ్ ఘాట్ ఎస్ఈజెడ్ పరీక్ష కేంద్రం లో సెంటర్ పడింది. అయితే చెవికి‌ రిసీవర్, బనియన్ కు ఎలక్ట్రానిక్ డివైస్ ను సౌరభ్ అమర్చాడు. సీసీ కెమెరాల్లో పరిక్షా కేంద్రం సిబ్బంది పరిశీలిస్తుండగా… సౌరభ్ కదలికలు అనుమానాస్పందంగా కనిపించడం తో చెకింగ్ చేసారు ఇన్విజిలేటర్స్. హర్యాణా నుంచి మిత్రుల సహాకారం తో సౌరభ్ పరిక్ష రాస్తున్నట్లు పసిగట్టిన సిబ్బంది… సరూర్ నగర్ పోలిసులకు ఫిర్యాదు చేసారు. దాంతో కేసు నమోదు చేసుకుని సౌరభ్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Exit mobile version