NTV Telugu Site icon

Group 1 Exams: రేపే గ్రూప్‌ 1 మెయిన్స్.. 46 పరీక్షలు కేంద్రాల వద్ద భారీ భద్రత..

Group 1 Exams

Group 1 Exams

Group 1 Exams: గ్రూప్‌ 1 మెయిన్స్ వాయిదా వేయాలనే అభ్యర్థుల ఆందోళనతో అధికారులు అలర్ట్ అయ్యారు. రేపటి(21 వ తేదీ) నుండి 27 వ తేదీ వరకు జరిగే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమీషనర్లు, సంబంధిత ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్ష చేశారు. ఏవిధమైన పొరపాట్లు లేకుండా అత్యంత పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 31,382 మంది అభ్యర్థులు హజరు కానున్నట్లు తెలిపారు. దీనికోసం 46 పరీక్షా కేంద్రాలు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో ఏర్పాట్లు, పరీక్షలు నిర్వహించేందుకు సిద్దమైనట్లు తెలిపారు. 2011 సంవత్సరం తర్వాత గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు మళ్ళీ జరుగుతున్నాయని తెలిపారు.

హైదరాబాద్ జిల్లాలో 8 , రంగారెడ్డి జిల్లాలో 11 , మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 27 మొత్తం 46 కేంద్రాలలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరుగనున్నాయని తెలిపారు. ప్రతి పరీక్ష హాల్, చీఫ్ సూపరింటెండెంట్ రూమ్, పరిసర ప్రాంతాలన్నింటిలోనూ సీసీ టీవీ లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. TGPSC కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పటు చేశామన్నారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల బయోమెట్రిక్ హాజరు తీసుకునేందుకై ప్రత్యేక సిబ్బంది నియామకం ఉంటుందన్నారు. మధ్యాహ్నం ఒకటిన్నర తర్వాత పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతి లేదన్నారు. ఒకటిన్నర తరువాత గేట్స్ క్లోజ్ చేస్తామని తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు ఎగ్జామ్ నిర్వహిస్తామన్నారు. దివ్యాంగులకు ప్రత్యేకంగా ఒక గంట అదనంగా కేటాయింపు ఉంటుందన్నారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద వైద్య సదుపాయం ఉంటుందన్నారు. అన్ని కేంద్రాలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సుల ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
Kishan Reddy: హైదరాబాద్‌ నుంచి యాద్రాద్రి వరకు ఎంఎంటీఎస్‌ సర్వీసులు..