NTV Telugu Site icon

Weather Warning: వాతావరణ హెచ్చరిక.. మూడు రోజులు భారీ వర్షాలు..

Telangana Wether

Telangana Wether

Weather Warning: తెలంగాణలో రాష్ట్రంలో కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలోని పలు చెరువులు నీటితో నిండాయి. తాజాగా కొద్దిరోజులుగా విరామం తీసుకున్న వర్షం..మళ్లీ మొదలైంది. గత రెండు రోజుల నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అదే సమయంలో, హైదరాబాద్ వాతావరణ శాఖ తాజాగా కీలక నగరాల వాసులకు ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. నగరంలో రానున్న మూడు రోజులు అంటే నేడు, రేపు మరియు ఎల్లుండి వారం (గురు, శుక్ర, శనివారాలు) వర్షాలు కురుస్తాయని అంచనా. ఈరోజు, రేపు బలమైన గాలుల ప్రభావం నగరంపై ఉంటుందని పేర్కొంది. రాగల మూడు రోజుల పాటు హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

Read also: Glass Tube Center : రాష్ట్రంలో ఫార్మాస్యూటికల్ గ్లాస్ ట్యూబ్ తయారీ కేంద్రం..

నేడు, రేపు రాష్ట్రవ్యాప్తంగా బలమైన గాలుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో అత్యధికంగా నిర్మల్ జిల్లా బాసరలో 4.08 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు. అదేవిధంగా మరికొన్ని ప్రాంతాల్లో కూడా అత్యధిక వర్షపాతం నమోదైంది. మరో మూడు రోజుల పాటు నగరంలో వర్షాలు కురుస్తాయి. ఇదిలావుంటే.. కొద్ది రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలు పలు రాష్ట్రాలను ముంచెత్తుతున్నాయి. ప్రకృతి సృష్టించిన విధ్వంసంతో కేరళ వణికిపోయింది. వందలాది మంది మరణించారు మరియు చాలా మంది అదృశ్యమయ్యారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా వరదల బీభత్సం కనిపిస్తోంది. కేరళ రాష్ట్రంలోనే కాకుండా ఉత్తరాది రాష్ట్రాలైన హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్ వంటి పలు రాష్ట్రాలు వరద నీటితో అతలాకుతలమయ్యాయి. కొండచరియలు విరిగిపడటంతో పలు జాతీయ రహదారులు మూతపడ్డాయి. మొత్తం మీద నగరంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయి.
Top Headlines @ 9 AM : టాప్‌ న్యూస్

Show comments