NTV Telugu Site icon

Weather Report : తెలంగాణకు భారీ వర్ష సూచన..

Rain Alert

Rain Alert

Heavy Rain Alert To Telangana
తెలంగాణలో జోరుగా వర్షలు కురుస్తున్నాయి. ఇప్పటికే కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలోని జలాశయాలు నిండుకుండల్లా మారాయి. గతంలో కురిసిన వర్షాలకు గోదావరి పరివాహక ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. ఇదిలా ఉంటే నేడు సాయంత్రం నుంచి తెలంగాణలో భారీ వర్షాలుకు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ వెల్లడించింది. పలు చోట్ల మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

 

అంతేకాకుండా.. కొమురంభీం, కామారెడ్డి, మెదక్‌, సిద్ధిపేట, రాజన్నసిరిసిల్ల, జనగాం, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, వికారాబాద్‌, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి ప్రాంతాల్లో మెరుపులతో కూడి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మిగితా జిల్లాలో అక్కడక్కడ ఉరుపులు పడే అవకాశం ఉందని పేర్కొంది వాతావరణ శాఖ.
Heavy Rain Alert To Telangana

 

Show comments