NTV Telugu Site icon

MLC Kavitha: నేడు కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ..

Kavitha

Kavitha

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు అనంతరం విచారణ చేపట్టనున్నారు. ఈకేసుపై జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారించనున్నారు. కాగా.. కవిత తరపు న్యాయవాది 40 నిమిషాల పాటు నిన్న వాదనలు వినిపించారు. ఈడి, సీబీఐ ఇవాళ వాదనలు వినిపించనున్నారు. న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ఇవాళ జడ్జిమెంట్ రిజర్వ్ చేస్తానన్నారు. నిన్న కవిత భర్త అనిల్ విచారణకు హాజరయ్యారు. కవిత తరఫున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. మహిళను విచారణ కోసం కార్యాలయానికి పిలవకూడదన్నారు. కేసు నమోదు చేసినప్పుడు కవిత పేరే లేదన్నారు. ఈ విచారణలో సమీర్, బుచ్చిబాబు, మాగుంట నా పేరు చెప్పారన్నారు. బెయిల్ కి ఉన్న గ్రౌండ్స్ ఏమిటి అని జడ్జి ప్రశ్నించారు.

Read also: Anand Deverakonda: ఆనంద్‌ దేవరకొండ సినిమా చేస్తాడా అనుకున్నా: వంశీ కారుమంచి

కేసు గురించి అన్ని విషయాలు తెలుసన్నారు. మరోవైపు కవితని అరెస్టు చేయాల్సిన అవసరం లేదని, దాని వల్ల ఈడి కి వచ్చి లాభం ఏమిటి ? అని కవిత తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. నేను గత మార్చిలో వరుసగా మూడు రోజులు విచారణకు వచ్చానని కవిత పేర్కొన్నారు. సూర్యాస్తమయం తర్వాత కూడా నన్ను విచారించారన్నారు. నా మొబైల్ ఫోన్ ను కూడా ఇచ్చానని తెలిపారు. మహిళ ఫోన్ లో సర్చ్ చేయడం సరికాదన్నారు. రైట్ టు ప్రైవసికి భంగం కలిగించారన్నారు. కొత్త మోడల్ ఫోన్ లు రావడంతో పాత ఫోన్లు పని మనుషులకు ఇచ్చానన్నారు. ఆ ఫోన్లు పని మనుషులు ఫార్మాట్ చేశారు, నాకేం సంబంధం లేదన్నారు. కస్టడీలో ఉన్న నిందితులతో కలిపి నన్ను ఈడి విచారణ జరపలేదన్నారు. ఎన్నో చార్జిషీట్లు దాఖలు చేసినా నా పేరు ఎక్కడ ప్రస్తావించలేదన్నారు.
Hyderabad Power Cut: నేడు నగరంలో పవర్‌ కట్‌.. ప్రాంతాల వారీగా షెడ్యూల్..