Junior Doctors: తెలంగాణలో జూనియర్ డాక్టర్లు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా.. నేటి నుంచి విధులకు హాజరు కాబోమని జూడాలు ప్రకటించారు. గత మూడు నెలలుగా స్టైపెండ్ ఇవ్వకపోవడంతో ఇవాల్టి నుంచి జూడాలు సమ్మెకు పిలుపునిచ్చారు. నేడు నుండి సమ్మె చేస్తామని ప్రభుత్వానికి వారు నోటీస్ ఇచ్చారు. దీంతో ఇవాళ సమ్మెకు జూనియర్ డాక్టర్ల ప్రతినిధుల బృందం సెక్రటేరియట్ కు చేరుకున్నారు. కాసేపట్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో జూడాల చర్చలు జరపనున్నారు. అయితే సెక్రటేరియట్ కు వచ్చిన జూనియర్ డాక్టర్ల ప్రతినిధుల బృందాన్ని లోపలికి అనుమతి లేదని పోలీసులు నిలిపివేశారు.
Read also: India Alliance Meeting: ఇండియా కూటమి కీలక భేటీ.. సీట్ల సర్దుబాటుపై చర్చ!
దీంతో సెక్రటేరియట్ గేటు బయటే జూ.డాక్టర్ల ప్రతినిధుల బృందం దామోదర రాకకోసం ఎదురు చూస్తున్నారు. కాగా.. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య విద్యార్థులు 10 వేల మంది వరకు ఉంటారు. అందులో.. గవర్నమెంట్ హాస్పిటల్ లో ఇంటర్న్షిప్ చేస్తున్న హౌస్ సర్జన్లు 2500 మంది ఉంటారు. పీజీ స్పెషాలిటీ విద్యార్థులు 4000 మంది ఉంటారు. సీనియర్ రెసిడెంట్లు 1500 ఉంటారు. ఇదిలా ఉంటే.. నేటి నుండి జూడాలు సమ్మెకు దిగుతుండడంతో గాంధీ ఆసుపత్రిలో పేషేంట్స్ కు ఎటువంటి ఇబ్బంది జరగకుండా ప్రత్యమ్నాయా ఏర్పాట్లు చేసామని గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు.
India Alliance Meeting: ఇండియా కూటమి కీలక భేటీ.. సీట్ల సర్దుబాటుపై చర్చ!