Harish Rao: పార్లమెంట్ ఎన్నికల కోడ్ వస్తె ఆరు గ్యారెంటీ ల అమలు పరిస్థితి ఎంటి ? అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరు గ్యారెంటీ లలో మొత్తం 13 హామీలు ఉన్నాయని, ఇప్పటికీ 2 హామీలను మాత్రం కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తుందని అన్నారు. ఆరు గ్యారెంటీ స్కీమ్స్ ల అమలు కోసం మార్గదర్శకాలు పార్లమెంట్ ఎన్నికల కోడ్ కంటే ముందే కాంగ్రెస్ సర్కార్ ఇవ్వాలని అన్నారు. ఫిబ్రవరి మూడవ వారం లోపు అరు గ్యారెంటీలను అమలు చేస్తే కాంగ్రెస్ కి చిత్తశుద్ధి ఉన్నట్టు లేక పోతే ఎగవేసే ప్రయత్నంగా చూడల్సి ఉంటుందన్నారు. వడ్లకి బోనస్ ఇస్తాం అని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇప్పుడు గైడ్ లైన్స్ ఇస్తే యసంఘి లో అయిన రైతులకు లబ్ధి అవుతుందన్నారు. రైతు బంధు నిధుల విషయములో ప్రభుత్వం వైపు నుంచి స్పష్టత లేదన్నారు. దాటవేత, ఎగవేత, కోతలకు కాంగ్రెస్ సర్కార్ ఆలోచన చేస్తున్నట్లు కనిపిస్తుందన్నారు. ఆరు గ్యారెంటీ లు వంద రోజుల్లో అమలు చేస్తాం అన్నారని గుర్తు చేశారు. మార్చి 17 నాటికి 100 రోజులు పూర్తి చేస్తామని, తొందర ఎందుకు అని కాంగ్రెస్ అంటుందని తెలిపారు.
Read also: Kishan Reddy: జనవరి 22న ప్రతి ఇంట్లో ఐదు దీపాలు వెలిగించండి..
జిల్లాలో పర్యటన లకు నాకు అనుభవాలు ఎదురు అయ్యాయని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ వస్తె ఆరు గ్యారెంటీ ల అమలు పరిస్థితి ఎంటి ? అని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ పరిధిలోకి తీసుకువచ్చే ప్రయత్నం లో ఉన్నారా? అన్న అనుమానాలు వస్తున్నాయన్నారు. మే చివరి వారం వరకు ఎన్నికల కోడ్ ఉంటుందన్నారు. బడ్జెట్ పూర్తి స్థాయిలో కాకుండా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పట్టే అవకాశం ఉన్నదని ప్రజల్లో ఉందన్నారు. పూర్తి స్థాయిలో బడ్జెట్ పెడితే ఈ స్కీమ్ కు ఎంత నిధులు పెడతారు అని తేలే ఛాన్స్ ఉంటుందని తెలిపారు. ఆరు గ్యారెంటీ లు అమలు చేయాలనీ కాంగ్రెస్ సర్కార్ కు ఉంటే పూర్తి స్థాయిలో బడ్జెట్ పెట్టాలన్నారు. మేము ఈసీకి ఎటువంటి ఫిర్యాదులు ఇవ్వం…పథకాలు అమలు కావాలని కోరుకుంటున్నామన్నారు. స్కీమ్ లకు గైడ్ లైన్స్ లేకుండా అప్లికేషన్ లు తీసుకోవడం రాష్ట్ర చరిత్రలో మొదటి సారని హరీష్ రావ్ అన్నారు.
Salaar : వైరల్ అవుతున్న సలార్ డైలాగ్ ప్రోమో.. పార్ట్ 2 పై ఆసక్తి పెంచేసిందిగా..