NTV Telugu Site icon

Harish Rao: మరో 4లక్షల ఓట్లు వచ్చి ఉంటే మన ప్రభుత్వమే ఉండేది..!

Harish Rao

Harish Rao

Harish Rao: రాష్ట్రంలో 4 లక్షల ఓట్లు వచ్చి ఉంటే ప్రభుత్వం మనదే ఉండేదని మాజీ మంత్రి హరీష్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ కృతజ్ఞత సభలో హరీష్ రావు మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో మొత్తంలో మనకు 1.8శాతం మాత్రమే ఓట్లు తక్కువగా వచ్చాయన్నారు. మనల్ని ప్రజలు పూర్తిగా తిరస్కరించాలేదు, 39 స్థానాలు గెలుచుకున్నామని అన్నారు. చరిత్రలో దక్షిణ భారత దేశంలో మూడోసారి ఏ ప్రభుత్వం రాలేదన్నారు. మన పార్టీకి దళిత బంధు, బీసీ బందుతో పాటు గృహ లక్ష్మి పథకాలు ఇబ్బంది పెట్టాయని కార్యకర్తలు చెప్పారన్నారు. మన పథకాలు ప్రచారం చేయడంలో విపలమయ్యామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తీరు ఆనాడు ప్రచారంలో అబద్ధాలు నేడు పాలనలో అసహనం ఉందని అన్నారు.

Read also: BJP MP Soyam Bapu Rao: సోయం బాపురావు మరో సారి హాట్ కామెంట్స్..

నాడు దావొస్ పర్యటన దండగా అన్నారు నేడు ముఖ్యమంత్రి ముందుగా ఎందుకు వెళ్ళాడని తెలిపారు. యుట్యూబ్ ఛానెల్ ప్రభావం మనపై పడిందని అన్నారు. అధికారంలోకి వచ్చిన మర్నాడే రెండు లక్షల రుణమాఫి చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు. నేటికీ కూడా రుణమాఫి ఉసే లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వేస్తే రైతుబందు డబ్బులను 15వేలకు పెంచుతామని చెప్పి ఎన్నికల ముందు డబ్బులు పడకుండా ఆపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి రైతుబందు డబ్బులు పడలేదు అన్నోల్లను చెప్పుతో కొట్టుమని అన్నారు. ఇదేం పద్దతి, కాంగ్రెస్ నాయకులు అహంకారంతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Bihar political crisis: రంగంలోకి సోనియాగాంధీ.. నితీష్‌కు ఫోన్ చేస్తే రిప్లై ఇలా..!?