NTV Telugu Site icon

Group-1 Prelims Exam: రేపు గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష.. షూ వేసుకుంటే నో ఎంట్రీ

Group 2

Group 2

Group-1 Prelims Exam: గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షకు టీఎస్‌పీఎస్సీ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. పరీక్ష ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్నారు. అయితే పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందే పరీక్షా కేంద్రాల వద్ద గేట్లను మూసివేస్తామని టీఎస్‌పీఎస్సీ అధికారులు స్పష్టం చేశారు. కాగా 33 జిల్లా కేంద్రాల్లోని 994 సెంటర్లలో ఆదివారం ఈ పరీక్ష జరగనుంది. గతంలో ఈ ప్రశ్నాపత్రాలు లీక్‌ అవడంతో ఈసారి పటిష్ట ప్రణాళికతో పరీక్ష నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తున్నది. దీని కోసం ఇప్పటికే పలు దఫాలుగా సమీక్షలు నిర్వహించింది. కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లతో సమావేశాలు జరిగింది.

ఈసారి ఈ పరీక్షలకు అథారిటీ ఆఫీసర్లుగా కలెక్టర్లను, చీఫ్‌ కో-ఆర్డినేటర్లుగా సబ్‌ కలెక్టర్లను నియమించింది. పరీక్షా కేంద్రాల్లో చీఫ్‌ సూపరింటెండెంట్లుగా వ్యవహరించే 1,995 మందికి ప్రత్యేక శిక్షణ ఇప్పించింది. వారితో టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ బీ జనార్దన్‌రెడ్డి, సెక్రటరీ అనితా రామచంద్రన్‌, పరీక్షల విభాగం ప్రత్యేకాధికారి బీఎల్‌ సంతోష్‌ శుక్రవారం జూమ్‌ మీటింగ్‌ నిర్వహించారు. పరీక్షా కేంద్రాల్లో చేపట్టాల్సిన ఏర్పాట్లు, పరీక్షల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేకంగా చర్చించారు. మొత్తం 503 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి నిరుడు ఏప్రిల్‌ 26న నోటిఫికేషన్‌ జారీచేసిన టీఎస్‌పీఎస్సీ.. అక్టోబర్‌ 16న పరీక్ష నిర్వహించింది. ఆ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న మొత్తం 3,80,032 మందిని ఆదివారం మళ్లీ పరీక్ష రాసేందుకు అనుమతించనున్నారు.

నిబంధనలు ఇవే..

ఈసారి ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేయనున్నారు. జంబ్లింగ్‌ విధానంలో ప్రశ్నలు రూపొందించారు. పరీక్షకు 15 రోజుల ముందే నమూనా పత్రాన్ని వెబ్‌సైట్‌లో ఉంచారు. కమిషన్ నిబంధనల ప్రకారం పరీక్షల్లో ఇక నుంచి నిబంధనలను ఉల్లంఘించే ఎవరైనా భవిష్యత్తులో ఎలాంటి పరీక్షలకు హాజరుకాకుండా డిబార్ చేయాలని సర్వీస్ కమిషన్ నిర్ణయించింది. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసుకు సంబంధించి 50 మందిని రెండు రోజుల్లో కమిషన్ డీబార్ చేసిన సంగతి తెలిసిందే. పరీక్షా కేంద్రాల్లో గొడవలకు పాల్పడినా, ఎలక్ట్రానిక్ పరికరాలతో పట్టుబడినా పోలీసు కేసులతో పాటు చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

గ్రూప్-1 అభ్యర్థులకు సూచనలు..

* ఎవరైనా OMR పత్రంలో తప్పులు చేసినట్లయితే, బదులుగా కొత్తది ఇవ్వబడదు.

* అభ్యర్థులు బూట్లు వేసుకుని పరీక్షకు రాకూడదని, చెప్పులు మాత్రమే ధరించాలని కమిషన్‌ స్పష్టం చేసింది.

* OMR డాక్యుమెంట్‌లో వ్యక్తిగత వివరాలు, సమాధానాలను బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్‌తో సరిగ్గా బబుల్ చేయాలి.

* సరైన వివరాలు లేని పత్రాలు బబుల్, పెన్సిల్, ఇంక్ పెన్, ఉపయోగించిన జెల్ పెన్, డబుల్ బబుల్ పత్రాలు చెల్లవు.

* అభ్యర్థులు హాల్ టిక్కెట్‌తో పాటు ప్రభుత్వ ఉద్యోగి, డ్రైవింగ్ లైసెన్స్ మొదలైనవాటి ఫోటోతో కూడిన ఆధార్ కార్డ్/పాన్ కార్డ్ లేదా ప్రభుత్వ గుర్తింపు కార్డును తీసుకురావాలి.

* అభ్యర్థులు ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కేసులు నమోదు చేయడంతోపాటు కమిషన్ నిర్వహించే పరీక్షలకు హాజరుకాకుండా డిబార్ చేయబడతారని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి.

* హాల్‌టికెట్‌లో ఫొటో సరిగా లేకపోతే అభ్యర్థులు చివరి నిమిషంలో ఇబ్బంది పడే ప్రమాదం ఉన్నదని తెలిపారు.

* దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా 3 పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలను గెజిటెడ్‌ అధికారితో సంతకం చేయించి తీసుకురావాలని తెలిపారు.
Top Headlines@1PM: టాప్‌ న్యూస్