Warangal:ఓ వైపు ట్రాఫిక్ జామ్ మరోవైపు పెళ్లి దగ్గర పడుతుండగా పెళ్లికొడుకు హైరానా పడ్డాడు. బోల్తా పడిన ట్యాంకర్‌ను ఎప్పుడు తొలగిస్తారా అని ఉత్కంఠగా ఎదురు చూశాడు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో ఈఘటన చోటుచేసుకుంది. జాతీయ రహదారి పక్కన గురువారం ఉదయం పెట్రోల్ ట్యాంకర్ బోల్తా పడింది. ప్రమాదం కారణంగా ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులతో పాటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పెళ్లికి వెళ్తున్న వరుడు ఈ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాడు. ముహూర్తం దగ్గరపడుతున్నా రద్దీ తగ్గలేదు. బోల్తా పడిన ట్యాంకర్ అక్కడే ఉండిపోయింది.
తొర్రూర్‌లో తన పెళ్లి ఉదయం 10 గంటలకు ఉందని, ముహూర్త సమయానికి కారులో వెళుతుండగా ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయానని వరుడు టెక్సన్ పట్టాడు. అయితే సమయం మించిపోతుందని పెళ్లి కొడుకు ఆందోళనకు గురయ్యాడు. కారు దిగి ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు అధికారుల వద్దకు వెళ్లాడు. కళ్యాణోత్సవం ముగిసిందని తన కోసం మండపంలో వేచి ఉన్నందున వెంటనే వాహనాలను క్లియర్ చేయాలని అధికారులను కోరాడు. అదే పనిచేస్తున్నామని.. కొంత సమయం పడుతుందని అధికారులు ఆయనకు సూచించారు. దీంతో అసహనానికి గురైన వరుడు కారును వెనక్కి తిప్పి కొంత దూరం ప్రయాణించాడు. కాగా.. ట్రాఫిక్ జామ్‌పై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు రంగ ప్రవేశం చేశారు. బోల్తా పడిన ట్యాంకర్‌ను భారీ క్రేన్ సహాయంతో బయటకు తీశారు. దీంతో ట్రాఫిక్ సమస్య తీరింది. ట్రాఫిక్ క్లియర్ కావడంతో మళ్లీ వెనక్కి వచ్చిన పెళ్లికొడుకు తొర్రూరు వెళ్లాడు. ఏది ఏమైనా అనుకోని ట్రాఫిక్ పెళ్లయిన కొడుకుని కాసేపు టెన్షన్ పెట్టింది. ప్రధాన రహదారిపై దాదాపు గంటపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసుల చొరవతో పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు ఊపిరి పీల్చుకున్నాడు. కారు స్పీడ్ పెంచి పెళ్లి మండపానికి చేరుకున్నాడు.
Read also: XRISM: చంద్రునిపై మరో ప్రయోగం.. శుభాకాంక్షలు తెలిపిన ఇస్రో
కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లి రోజే పెళ్ళికొడుకు మృతగేహం లభ్యం కావడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. లింగంపేట మండలం ఎల్లారం అటవీ ప్రాంతంలో కుళ్ళిన స్థితిలో చెట్టుకు ఉరేసుకున్న పెళ్ళికొడుకు మృతదేహం లభ్యమైంది. సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి కి చెందిన రాజేందర్ రెడ్డి(29)గా గుర్తించారు పోలీసులు. ఈనెల 3న తన పెళ్లి పత్రికలు పంచి వచ్చాక బయటకు వెళ్లి వస్తానని రాజేందర్ వెళ్ళాడని ఆ తరువాత ఇంటికి తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. తన పెళ్లిరోజు అయిన 7వ తేదీన కుళ్లిన స్థితిలో మృత దేహం లభ్యం కావడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్వంతమయ్యారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
XRISM: చంద్రునిపై మరో ప్రయోగం.. శుభాకాంక్షలు తెలిపిన ఇస్రో