తన పుట్టిన రోజు సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్పూర్తిగా తీసుకొని హైదరాబాద్ లోని తన నివాసంలో ఈ రోజు ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ మొక్కలు నాటారు. తాను నాటిన మొక్క బతికి భూమిపై పచ్చదనాన్ని ఇవ్వాలని కోరుకున్నట్లు తెలిపారు. స్మితాసబర్వాల్ గారి పుట్టినరోజు పురస్కరించుకొని ఆమె పై ఉన్న అభిమానంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు మొక్కలు నాటి సోషల్ మీడియా వేదికగా ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన స్మితా సబర్వాల్..
