Site icon NTV Telugu

ర‌క్త‌దానం అంటే.. జీవ‌న దాన‌మే.. యువ‌త‌ను ప్రోత్స‌హించాలి..

Governor Tamilisai Soundara

రాష్ట్రంలో రక్త నిల్వలు సరిపడా లేకపోవడం ఆందోళన క‌ల‌గిస్తోంద‌న్నారు గ‌వ‌ర్న‌ర్ డాక్టర్ తమిళిసై సౌంద‌ర‌రాజ‌న్‌… ప్ర‌పంచ ర‌క్త‌దాత‌ల దినోత్స‌వం సంద‌ర్భంగా రెడ్‌క్రాస్ ప్ర‌తినిధుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించిన ఆమె.. ర‌క్త‌దానం అంటే.. జీవ‌న దాన‌మే అని తెలిపారు. యువతలో సరైన అవగాహన కల్పించినప్పుడు వారిని రక్తదానం వైపు ప్రోత్సహించడం సులువు అవుతుంద‌న్నారు గ‌వ‌ర్న‌ర్‌.. కోవిడ్ సంక్షోభ సమయంలో మంచి జాగ్రత్తలతో, రక్తదానాన్ని ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఉందని, అలాగే రక్త దాతలలో మరింత స్ఫూర్తిని పెంపొందించాల్సి ఉంటుందని సూచించారు. ర‌క్త‌దాత‌ల సేవ‌లు గుర్తించి.. వారిని అభినందించాల‌ని చెప్పారు. రక్తదానాన్ని ప్రోత్సహించడంలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని, రక్తదానం పట్ల అపోహలను తొలగించి సరైన అవగాహన కల్పించడం అత్యంత ఆవశ్యకమని స్పష్టం చేశారు. రోజుకు దాదాపు 600 బ్లడ్ యూనిట్స్ సరఫరా చేసి తలసీమియా వ్యాధి బారిన పడిన చిన్నారులను రక్షిస్తున్న తెలంగాణ రెడ్ క్రాస్ సేవలను ప్ర‌శ్నించిన గ‌వ‌ర్న‌ర్.. ప్రకృతి వైపరీత్యాల సమయంలో, కోవిడ్ సంక్షోభ సమయంలో, ఇతర విపత్తుల, సంక్షోభ సమయాలలో తెలంగాణ రెడ్ క్రాస్ శాఖ అందిస్తున్న సేవలు అభినందనీయం అన్నారు.

Exit mobile version