15 New Fire Stations: తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 15 కొత్త అగ్నిమాపక కేంద్రాలను ఆమోదించింది. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 15 ఫైర్ స్టేషన్లను ప్రభుత్వం చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులో, తెలంగాణ హోం శాఖ, తెలంగాణ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన , అగ్నిమాపక సేవలు, “రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం ఒక అగ్నిమాపక కేంద్రం ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ప్రకారం, రాష్ట్రంలో ప్రస్తుతం అగ్నిమాపక కేంద్రాలు లేని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఫైర్ స్టేషన్ల నిర్వహణ కోసం 382 పోస్టులతో పాటు 15 కొత్త అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటు చేసేందుకు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, కొత్తగా మంజూరైన ఉద్యోగాల్లో 367 పోస్టులను శాశ్వత ప్రాతిపదికన, 15 పోస్టులను అవుట్ సోర్సింగ్ పద్ధతిలో తీసుకోనున్నారు.
Read also: Etela Rajender: తిరిగి టీఆర్‌ఎస్‌లోకి.. స్పందించిన ఈటల రాజేందర్
కొత్త ఫైర్ స్టేషన్లు ఎక్కడంటే.. మల్కాజిగిరి, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, షాద్‌నగర్, అంబర్‌పేట్, చాంద్రాయణగుట్ట, జూబ్లీహిల్స్, స్టేషన్ ఘన్‌పూర్, డోర్నకల్, నర్సాపూర్, హుస్నాబాద్, కల్వకుర్తి, బాల్కొండ, ధర్మపురి, పినపాక నియోజకవర్గాల్లో అగ్నిమాపక కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి.
Niranjan Reddy: 10 రోజుల్లో రూ.5 లక్షల పరిహారం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ