NTV Telugu Site icon

KTR Tweet: ముసలోడిని అయిపోయా.. కేటీఆర్ ఆసక్తికర ట్వీట్

Ktr Tweet

Ktr Tweet

KTR Tweet: సామాజిక మాధ్యమాల్లో, ట్విటర్‌ లో మంత్రి కేటీఆర్‌ నిత్యం చురుకుగా ఉంటారు. అది అందరికి తెలిసిన విషయమే.. ప్రతి అంశాలపై స్పందిస్తూ కేంద్రంతో పాటు విపక్షాలపై తనదైన శైలిలో వ్యంగాస్ర్తాలు వేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్దిని ప్రజల్లోకి తీసుకెళ్తుంటారు. మంత్రి అభిమానులు, కార్యకర్తలు, సాధారణ ప్రజలు ఇలా ఎవరు సాయం కోసం అభ్యర్థించినా వెంటనే స్పందిస్తూ.. వాళ్లకు తగినైన సాయం చేస్తుంటారు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ గా వుంటూ.. కేటీఆర్‌ అప్పుడప్పుడూ కొన్ని ఆసక్తికర విషయాలు కూడా నెటిజన్లతో పంచుకుంటూ ఉంటారు.

Read also: China Spy: బౌద్ధ సన్యాసిని ముసుగులో చైనా గూఢాచారి.. అరెస్ట్ చేసిన పోలీసులు

ఈనేపథ్యంలో ఆసక్తి కరమైన ట్వీట్‌ చేశారు మంత్రి కేటీఆర్‌. ఆట్విటర్‌ లో ఏముందంటే.. ఇన్ని రోజులు కంటి అద్దాలు పెట్టుకునేందుకు నామోషీగా ఫీలయ్యే వాడిని కానీ.. ఇప్పుడు ఆ..తిప్పలు తప్పేలా లేదు. కళ్ల అద్దాలు పెట్టుకోకుండా ఇప్పుడు నేను చదవలేకపోతున్నా.. అంటూ నవ్వుతున్న ఇమోజీని జతచేస్తూ..తన ట్వీటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు కేటీఆర్‌. దీన్ని చూసిన నెటిన్లు అన్నా నువ్వు అద్భుతం అంటూ పోస్ట్ చేస్తుంటే మరి కొందరు మీరు అద్దాలు పెట్టుకుంటే జెంటిల్‌ మెంట్‌గా వున్నావన్నా అంటూ రీట్వీట్‌ చేస్తున్నారు. ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అని ఇంకొందరు.. ఇతరుల సమస్యలను పరిష్కరించడానికి జీవించే వ్యక్తులు ఎప్పటికీ ముసలోరు కారు.. దేవుడు సర్వశక్తిమంతులు.. మీకు కళ్ళు ఇచ్చాడు.. మీరు ఎల్లప్పుడు పేదవారికి సహాయం చేస్తారు. మీరు ప్రజలకు కోసం జీవిస్తారు అంటూ.. .. కళ్ల అద్దాలు ధరించడం వల్ల పాతపడిపోరు సార్‌ అంటూ మరికొందరు ట్వీట్‌ ల వర్షం కురిపిస్తున్నారు. ఆదిలాబాద్‌ వాసి అయిన ఆర్టిస్ట్ ద్యావంత్ రమేష్ సార్ మీరు అద్దాల తో అందంగా ఉన్నారు సార్ అంటూ కేటీఆర్‌ ట్వీట్ చేసి ఫోటోనే రమేష్‌ ఆర్ట్‌ చేసిన పోటోను కేటీఆర్‌కు రీ ట్వీట్‌ చేసారు. మొత్తానికి ఇప్పుడు మంత్రి కేటీఆర్‌ కళ్ల అద్దాలు పెట్టుకున్న ఫోటో నెట్టింట వైరల్‌ అవుతోంది.