NTV Telugu Site icon

Gangula Kamalakar: రైతుబంధు డబ్బులు వెంటనే విడుదల చేయాలి..

Gangula Kamalakar

Gangula Kamalakar

Gangula Kamalakar: రైతుబంధు డబ్బులు వెంటనే విడుదల చేయాలని అన్నారు. ఎండిన పంటలకు పరిహారం… అన్ని పంటలకు బోనస్ డిమాండ్ తో బీఆర్ఎస్ చేపట్టిన రైతు నిరసన దీక్షలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశానుసారం, తెలంగాణ రాష్ట్ర బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ పిలుపుమేరకు రైతుల కోసం దీక్ష చేస్తున్నట్లు తెలిపారు. రైతులు పండించిన వరి పంటలు నీరు లేక ఎండినపోయిన పంటలకు రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని కోరారు.

Read also: Harsih Rao: బీజేపీ వాళ్ళు దీక్షలు చేయాల్సింది గల్లీలో కాదు ఢిల్లీలో..

ఎండిన పంటలకు ఎకరాకు 25 వేల రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన మద్దతు ధరకు 500 రూపాయల బోనస్ హామీ ఈ సీజన్ నుంచే అమలు చేయాలన్నారు. చివరి దశలో ఉన్న పంటలను కాపాడేందుకు సాగునీరు ఇవ్వాలన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 25 లక్షల ఎక్స్ గ్రేషియో ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుబంధు డబ్బులు వెంటనే విడుదల చేయాలన్నారు. కరీంనగర్ నగరానికి ప్రతీరోజూ తాగునీరు ఇవ్వాలని, నగర తాగునీటి అవసరాలకు లోయర్ మానేరు లో నీటి నిల్వ చేయాలన్నారు.
Top Headlines @1PM : టాప్ న్యూస్