Site icon NTV Telugu

Ganesh Nimajjanam: వినాయకా.. వీడ్కోలిక..!

Khairatabad Ganesh

Khairatabad Ganesh

ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా గణేష్ నిమజ్జనం సాగనుంది. ఇప్పటికే గణేష్‌ విగ్రహాలను భక్తులు నిమజ్జనం చేస్తున్నారు. హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనానికి ప్రత్యేక స్థానం ఉంది. నగరంచుట్టూ ఉన్నప్రాంతాల్లో కూడా గణపయ్యకు బైబై చెప్పే కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఖైరతాబాద్‌ లో కొలువుదీరిన శ్రీపంచముఖ మహాలక్ష్మి గణపతి నిమజ్జనానికి అన్నిఏర్పాట్లు పూర్తయ్యాయి. అరభైఏడు సంవత్సరాల ఉత్సవ కమిటీ చరిత్రలో తొలిసారి 50 అడుగుల మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. వినాయకుడు సుమారు 70 టన్నుల బరువున్న ఖైరతాబాద్‌ మహాగణపతిని తరలించేందుకు ఈ ఏడాది అత్యాధునిక ట్రాలీ వాహనాన్ని వినియోగిస్తున్నారు. ఇక దశాబ్ద కాలంగా ఎస్టీసీ ట్రాన్స్‌పోర్టు యజమానులు వెంకటరత్నం, సుధీర్‌లు మహా వినాయకుడి శోభాయాత్రకు ఉచితంగానే ట్రాలీ వాహనాన్ని సమకూరుస్తున్నారు.

ఇది ప్రతి ఏడాది మాదిరి ఖైరతాబాద్‌ గణేశుడిని ఎన్టీఆర్‌ మార్గ్‌లోని క్రేన్‌ నం.4 వద్దే నిమజ్జనం చేయనున్నారు, మోడ్రన్‌ కంపెనీకి చెందిన ఈ క్రేన్‌ వంద టన్నుల బరువును సునాయసంగా ఎత్తుతుంది. నిన్న రాత్రి 9.30 గంటల నుంచి 10 గంటల మధ్య పంచముఖ మహాగణపతికి ఉద్వాసన పూజ నిర్వహిస్తారు. కలశాన్ని కదిలించి నిమజ్జనానికి ఏర్పాట్లు ప్రారంభిస్తారు. రాత్రి 11 నుంచి 12 గంటల మధ్య ఉపమండపాల్లో ప్రతిష్ఠించిన శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ త్రిశక్తి మహాగాయత్రి అమ్మవార్ల విగ్రహాలను ట్రాలీపై పెడుతారు. ఇక అర్ధరాత్రి 1 గంటకు పంచముఖ మహాలక్ష్మి గణపతిని ట్రాలీపై ఉంచి వెల్డింగ్‌ పనులు ప్రారంభిస్తారు. ఇవాళ ఖైరతాబాద్‌ శ్రీ పంచముఖ మహాలక్ష్మి గణపతి శోభాయాత్ర ఉదయం 7 గంటలకే ప్రారంభంకానుంది… సెన్షెన్‌ థియేటర్‌, ఐఐఎంసీ కళాశాల చౌరస్తా, టెలిఫోన్‌ భవన్‌, పాత సచివాలయం గేటు, తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ చౌరస్తా, లుంబినీ పార్కు మీదుగా ఎన్టీఆర్‌ గార్డెన్‌ ఎదురుగా ఉన్న క్రేన్‌ నం.4 వరకు మధ్యాహ్నం 12 గంటల వరకు చేరుకుంటుంది. ఇక తుది పూజల అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు నిమజ్జనం పూర్తి చేసేఅవకాశం ఉంది.
Balapur Ganesh Shobha Yatra- 2022: బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం, శోభాయాత్ర లైవ్

Exit mobile version