NTV Telugu Site icon

Shamshabad: విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. శంషాబాద్‌ నుంచి మరో 4 ఫ్లైట్ సర్వీసులు

Shamshabad Airport

Shamshabad Airport

Shamshabad: హైదరాబాద్‌లోని శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రస్తుతం అనేక దేశాలకు విమానాలను అందిస్తోంది. దేశంలోని అనేక ప్రధాన నగరాలకు దేశీయ విమానాలు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల విమానాశ్రయంలో కొత్త టెర్మినల్‌ను ప్రారంభించారు. కాగా, విమాన ప్రయాణికులకు ఆర్జీఐఏ అధికారులు మరో శుభవార్త అందించారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి మరో నాలుగు విమాన సర్వీసులను అందించారు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సహకారంతో ఈ విమానాలు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. కొచ్చి, గ్వాలియర్, అమృత్‌సర్ మరియు లక్నోలకు కనెక్షన్లు ఉంటాయి. ఈ విషయాన్ని విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. శుక్రవారం నుంచి అమృత్‌సర్‌, లక్నో, కొచ్చిలకు సర్వీసులు ప్రారంభించినట్లు జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ సీఈవో ప్రదీప్‌ పణిక్కర్‌ తెలిపారు.

గ్వాలియర్ నవంబర్ 28 నుండి ప్రారంభమవుతుంది. మెరుగైన ప్రయాణ సౌకర్యాల కోసం ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. అమృత్‌సర్‌కు వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ప్రతిరోజూ ఉదయం 7.30 గంటలకు శంషాబాద్ నుండి బయలుదేరి 10.15 గంటలకు చేరుకుంటుందని ఆయన చెప్పారు. కొచ్చికి వెళ్లే విమానం ప్రతిరోజూ రాత్రి 7.45 గంటలకు శంషాబాద్ నుంచి బయలుదేరి రాత్రి 9.30 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. శంషాబాద్-లక్నో మధ్య వారానికి ఆరు సర్వీసులు ఉంటాయని అధికారులు తెలిపారు. ఇక్కడి నుంచి మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరి 4.35 గంటలకు లక్నో చేరుకుంటుంది. శంషాబాద్-గ్వాలియర్ మధ్య వారానికోసారి మూడు సర్వీసులు ఉంటాయని తెలిపారు. ఇది శంషాబాద్‌లో మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరి 4.20 గంటలకు గ్వాలియర్ చేరుకుంటుంది.
Priyanka Gandhi: రేపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రియాంక గాంధీ పర్యటన

Show comments