Site icon NTV Telugu

టీఆర్ఎస్‌లో విషాదం.. మాజీ మంత్రి కన్నుమూత.. కేసీఆర్‌ సంతాపం

టీఆర్ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌ కన్నుమూవారు.. కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన.. కాసేపటి క్రితమే.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలారు.. సంగారెడ్డి జిల్లా జాహీరాబాద్‌కు చెందిన అల్హాజ్ మహమ్మద్ ఫరీదుద్దీన్‌… హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికొత్స పొందుతూ మరణించినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కేబినెట్‌లో మైనారిటీ శాఖ మంత్రిగా పనిచేసిన ఫరీదుద్దీన్.. ఇక, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్‌ పార్టీలో చేరారు.. 2016 సంవత్సరంలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

Read Also: కొత్త ఇల్లు కొనేవారికి శుభవార్త.. షరతులు ఇవే..!

ఇక మాజీ ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ మృతి పట్ల టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు అభిమానులు సంతాపం తెలిపారు.. మరోవైపు మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ మహ్మద్ ఫరీదుద్దీన్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు.. మైనారిటీ నేతగా, ప్రజాప్రతినిధిగా వారు చేసిన సేవలను సీఎం గుర్తు చేసుకున్నారు. ఫరీదుద్దీన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్.

Exit mobile version