Former Maoist Arrested: మాజీ మావోయిస్టు నేత గాదె ఇన్నయ్య అరెస్ట్.. గాదె ఇన్నయ్య (గాదె ఇన్నారెడ్డి)తో పాటు మరి కొందరిపై కేంద్ర నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) కేసులు నమోదు చేసింది. నిషేధిత సంస్థలు చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడుతున్నాయి, తద్వారా భద్రతకు ముప్పు కలిగిస్తున్నాయని ఎన్ఐఏ తెలిపింది. సీపీఐ (మావోయిస్ట్) అనుబంధ సంస్థ అయిన ఏబీఎంఎస్ (అమరుల బంధు మిత్రుల సంఘం) ఏర్పాటు చేసిన అంత్యక్రియల సభలో గాదె ఇన్నయ్య ప్రసంగిస్తూ.. భారత ప్రభుత్వంతో పాటు భద్రతా బలగాలపై తీవ్ర విమర్శలు వ్యక్తం చేశారని.. అలాగే, రామచంద్రారెడ్డి (వికల్ప్) బూటకపు ఎన్‌కౌంటర్‌లో హత్య చేయబడ్డారని గాదె ఇన్నయ్య ఆరోపించారు.
Read Also: స్మార్ట్ వాయిస్, స్మార్ట్ డ్రైవ్.. CES 2026లో BMW iX3 SUV ప్రత్యేకతలు ఇవే!
ఇక, NIA అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గాదె ఇన్నయ్య ప్రసంగానికి సంబంధించిన వీడియో సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయి.. అంత్యక్రియల సభలో 150-200 మంది ప్రజలు పాల్గొన్నారు.. గాదె ఇన్నయ్య ప్రసంగం యూట్యూబ్‌లో రికార్డు చేయబడింది.. ఆయన చేసిన ప్రసంగం దేశానికి వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటు కార్యకలాపాలను ప్రేరేపించడానికి ప్రయత్నించినట్లు ఉందని NIA తెలిపారు. ఈ కారణంగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పేర్కొనింది.
