Fire accident: హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్నిప్రమాద ఘటన మరువక ముందే.. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లోని శాస్త్రీపురంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తాజాగా మరోసారి నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మల్లాపూర్ పారిశ్రామికవాడలో జేపీ ఇండస్ట్రీస్ కంపెనీలో అగ్నిప్రమాదం జరగడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందని ఫైర్ శాఖ ప్రాథమిక నిర్దారించారు. కనీస ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడం వల్లే భారీ అగ్నిప్రమాదం సంభవించిందని పేర్కొన్నారు. మొత్తం 11 ఫైర్ ఇంజన్ లు అదనంగా 40 వాటర్ ట్యాంకర్ ద్వారా ఫైర్ సిబ్బంది శ్రమించి నిన్న రాత్రి మంటలు అదుపులోకి తెచ్చారు. దీంతో జేపీ పెయింటింగ్ కంనిలో మంటలు పూర్తిగా అదుపులో వచ్చాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ఫైర్ సిబ్బంది ప్రాథమికంగా నిర్ధారించారు. లక్షల్లో ఆస్తినష్టం జరిగిందని తెలిపారు.
Read also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
మల్లాపూర్ పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జీపీ కెమికల్ పరిశ్రమలో మంటలు, దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. పరిశ్రమలో కెమికల్ ఉండటంతో ఓ పక్క మంటలను అగ్ని మాపక సిబ్బంది అదుపు చేస్తున్నా మరో పక్క మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న రాచకొండ సీపీ డీఎస్. చౌహాన్ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పారిశ్రామిక వాడలో ఇంతకు ముందు కూడా అగ్ని ప్రమాదాలు జరిగినా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడంతో తరచు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.