Bahadur Pura: భాగ్యనగరంలోని పాతబస్తీ బహదూర్ పురా స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఎన్‌ఎం గూడ అంబేద్కర్ విగ్రహం వద్ద పార్కింగ్ లో వున్న బస్సులో మంటలు చెలరేగాయి. అయితే మంటలు షార్ట్ షర్క్యూట్ వల్లే ఫైర్ అయ్యనట్లు సమాచారం. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలికి చేరుకున్న రెండు ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే ఒక పూర్తిగా దగ్ధం కాగా.. మరో బస్సు పాక్షకంగా దగ్ధం మయ్యింది. కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇది షార్ట్ షర్య్కూట్ వల్లే మంటలు చెలరేగాయా? ఇది ఎవరైనా ఆకతాయుల ఈఘటనకు కారకులా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఉదయం ఒక్కసారిగా పార్కింగ్ లో మంటలు చలరేగడంతో స్థానికు భయాందోళనకు గురయ్యారు. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులో చేయడంతో ఊపిరి పీల్చుకున్నారు.
Read also: Tanker Accident: హైవేపై ట్యాంకర్ బీభత్సం.. 40కి పైగా వాహనాలు ధ్వంసం
ఈ మాసంలోనే 15న నిర్మల్ జిల్లాలో బస్సులో మంటలు చెలరేగాయి. సోన్ మండలం గంజాల్ టోల్ ప్లాజా వద్ద ఇవాళ తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సులో ఆకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. అయితే ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 26 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనర్ ఉన్నారు. మంటలు వ్యాపించగానే అప్రమత్తమై అందరూ కిందకు దిగారు. దీంతో తృటిలో ప్రమాదం తప్పింది.
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
