Road Accident: హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. ఆమనగల్లు మండల శివారులో ఆర్టీసీ బస్సు కారును ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికితీశారు. మృతులు హైదరాబాద్ వాసులుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read also: Chhattisgarh : బీజాపూర్‌లో నక్సలైట్లపై దాడి.. 24 గంటల్లో ఎనిమిది మంది మృతి
అతి వేగం, నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. మృతుల కుటుంబ సభ్యుల వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కారులో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ట్రాఫిక్ స్తంభించింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు.
Ananya Nagalla : కర్ర సాముతో అదరగొడుతున్న అనన్య.. వీడియో వైరల్..