NTV Telugu Site icon

Fake Officer: నేను కేసు పెడితే సీఎం ఆపలేడు… పీఎం తెలిస్తే ట్రై చేయ్..

Fake Officer

Fake Officer

Fake Officer: నకిలీ ఫుడ్ ఇన్స్పెక్టర్ అక్రమ వసూళ్లు ఆగడాలు నగరంలో మితిమీరుతున్నాయి. ఫుడ్ ఇన్స్పెక్టర్ అంటూ బెదిరిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రజలకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఫోన్ చేసి వ్యాపారస్తులను బెదిరించడం చేతికి అందినంత దోచుకోవడమే వీళ్ల పనిగా పెట్టుకున్నారు. మీ షాప్ లో నకిలీ సరుకులు ఉన్నాయని, డేట్ అయిపోయిన సరుకులు అమ్ముతున్నారని వ్యాపారస్తులకు భయభ్రాంతులకు గురిచేసి డబ్బులు దోచుకుంటున్నారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియని అమాయక ప్రజలు భయపడి డబ్బులు ఇవ్వడంతో ఇదే పని కంటిన్యూ చేశారు కేటుగాళ్లు.. అయితే అది ఎన్నోరోజులు జరగలేదు.. నకిలీ ఆటలు మూడు నెలల తరువాత ఆఫీసర్ ఆగడాలు బయటపడటంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకోవడంతో వ్యాపారస్తులు భయాందోళన చెందుతున్నారు.

Read also: Rental Houses: హైదరాబాద్‌లో అద్దె ఇండ్లకు ఫుల్ డిమాండ్.. ఓఆర్ఆర్ దాటి వెళ్ళాల్సిందే..

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జయప్రకాశ్ రెడ్డి నివాసం ఉంటున్నాడు. కష్టపడకుండా డబ్బు ఎలా సంపాదించాలి అనేది ప్లాన్ వేశాడు. అయితే అతనికి ఒక ఆలోచన వచ్చింది. తాను ఫుడ్ ఇన్స్పెక్టర్ రాష్ట్రస్థాయి అధికారి అంటూ తన పేరు జయప్రకాశ్ రెడ్డిగా చెప్పుకుంటూ 9311679167 వ్యాపారస్తులకు ఫోన్ చేసి బెదిరించడం మొదలు పెట్టాడు. తన అకౌంట్ లోకి డబ్బులు పంపాలని బ్లాక్ మెయిల్ చేసేవాడు. అయితే అది నిజమని నమ్మిన కొందరు వ్యాపారస్తులు డబ్బులు పంపించేవారు. అయితే ఇలా మూడు నెలలుగా నకిళీ జయప్రకాశ్ భాగోతం సాగింది. నేను కేసు రాసి సంతకం పెడితే సీఎం ఆపలేడు… పీఎం తెలిస్తే ట్రై చేయండి అంటూ వ్యాపారస్తులకు బెదిరింపులు… నేను చలానా రాస్తే ఢిల్లీకి వెళ్లి డబ్బులు చెల్లించాలి అంటూ బెదిరించాడు.

అంతే కాదు చలానా కడితే పర్వాలేదు…. లీగల్ గా వెళ్తానంటే ఇబ్బందులు తప్పవు అంటూ బెదిరింపులకు పాల్పపడ్డాడు. నా కాల్ డిస్కనెక్ట్ చేస్తే మళ్ళీ కాల్ రాదు.. కాల్ కనెక్ట్ అవ్వదు అంటూ పలికేవాడు. ఉమ్మడి జిల్లాలో టిఫిన్ సెంటర్లు ఆయిల్ ఏజెన్సీలు రెస్టారెంట్లు లక్ష్యంగా నకిలీ అధికారి వసూళ్లు చేసాడు. నకిలీ అధికారి మాటలు నమ్మి పలువురు వ్యాపారస్తులు మోసపోయారు. ఫోన్ పే గూగుల్ పే ద్వారా ఫైన్ పేరుతో నకిలీ అధికారి వసూళ్ల పర్వం కొనసాగింది. నకిలీ ఫుడ్ సేఫ్టీ అధికారి ఆడియో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 9311679167 కాల్ చేస్తు నాట్ రెస్పాండ్ రావడంతో పోలీసులు తలనొప్పిగా మారింది. ఇలాంటి వారిని నమ్మవద్దని చెప్పినా ప్రజలు పదే పదే నమ్మి మోసపోవడం మళ్లీ పోలీసులకు ఆశ్రయిస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు.
Marriage: భర్తకు మరో యువతితో పెళ్లి చేసింది కానీ.. ట్విస్ట్ మామూలుగా ఇవ్వలేదుగా మేడం..