Site icon NTV Telugu

Fake Doctor: హైదరాబాద్‌లో బయటపడ్డ ఫేక్ డాక్టర్ బండారం.. బాధితుల్లో వీఐపీలు..!

Fake Doctor Gnaneshwar Arrested In Hyderabad

Fake Doctor Gnaneshwar Arrested In Hyderabad

Fake Doctor: కూరగాయలు అమ్మే వారితో బేరం కుదుర్చుకుని కూరలు తీసుకుంటాం.. అదేంటో.. కాస్త జబ్బు అయితే ఎవరు ఏం చెప్పినా నమ్మి.. అసలు వైద్యులా కాదా అని కూడా తెలియకుండా వెళ్లి లక్షలు చెల్లిస్తాం. కారణం ఆరోగ్యం బాగుంటే మళ్లీ అయినా సంపాదించుకోవచ్చు కదా అనే నమ్మకం. అయితే కొంతమంది చేసే చేష్టలు డబ్బులు సంపాదించుకోవచ్చు కానీ.. అవివేకంగా చేసే వాళ్లతీరుపై అమాయకులో లేక ఆలోచించి పనులు చేస్తారో అర్థంకానీ పరిస్థితిలో ఉంటారు. డబ్బుపెట్టి ఏదైనా కోనాలన్నా.. తినాలన్నా అనే ఆలోచించే వారు ఒక్కొక్కసారి వారు చేసే పనులపై వారికే అవగాహన లేకుండా పోతుంటుంది. వివేకాన్ని వదిలేసి మూఢనమ్మకాలతో మత్తులో కూరుకుపోయి.. అన్నీ సమర్పిస్తాం. కానీ.. వీటన్నింటికీ కారణం.. మనలోని ఆ విపరీతమైన జాగ్రత్త, భయం, అమాయకత్వమే. వీరికి మద్దతుగా కొందరు నకిలీ బాబాలు, నకిలీ వైద్యులు పుట్టుకొస్తున్నారు. అలాంటి ఓ నకిలీ ఆయుర్వేద వైద్యుడు వెలుగులోకి వచ్చాడు.

హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్‌లో ఎస్‌వోటీ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఓ ఇంట్లో క్షుద్ర పూజలు జరుగుతున్నాయన్న సమాచారంతో సోదాలు నిర్వహించగా.. నకిలీ వైద్యుడు బండారం బయటపడింది. బీహార్ కు చెందిన జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి ఆయుర్వేద వైద్యుడిగా పనిచేస్తున్నాడు. రెండేళ్లుగా జీఎన్ ఆర్ ఆయుర్వేద పేరుతో ఆస్పత్రిని నిర్వహిస్తున్నాడు. వైద్యం కోసం వచ్చిన వారికి క్షుద్రపూజలు చేస్తున్నాడు. ఒక ఇంట్లో క్షుద్రపూజలు చేస్తున్నారన్న సమాచారం తో ఎల్బీనగర్ SOT పోలీసుల సోదాలు నిర్వహించగా నిర్ఘంతపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. వైద్యం పేరుతో క్షుద్రపూజలు పూజలు చేస్తున్న జ్ఞానేశ్వర్ ను అరెస్ట్ చేశారు. భారీగా క్షుద్రపూజ సామాగ్రి, స్వాధీనం చేసుకున్నారు. పుర్రెల దండతో సహా ఉర్దూలో రాసిఉన్న పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. GNR ఆయుర్వేదం పేరుతో హస్పిటల్ నడుపుతున్న జ్ఞానేశ్వర్. వైద్యం కోసం వచ్చిన వారికి చేతబడి చేశారంటూ పూజలు మొదలుపెట్టాడు.

అదినమ్మిన బాధితులు అతని వద్దకు క్యూ కట్టారు. ఇదే అలుసుగా భావించిన జ్ఞానేశ్వర్ డబ్బులు కోసం తన చుట్టు తిప్పుకుని పూజలు చేయడం స్టార్ట్ చేశాడు. ఫేక్ డాక్టర్ క్షుద్రపూజల ఖాతాలో పలువురు విఐపీలు ఉన్నారని సమాచారం తెలియడంతో పోలీసులకే షాక్ తగిలింది. సీసీ పుటేజ్, హార్డిస్క్ స్వాధీనం చేసుకున్నారు. వాట్సప్ కాల్ లీస్ట్, మెస్సేజ్ చాటింగ్ లో కీలక విషయాలు వెలుగుచూసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 420, 506 IPC సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జ్ఞానేశ్వర్ ను అదుపులోకి తీసుకొని ఎల్బీనగర్ పోలీసులు విచారిస్తున్నారు. ఇలాంటి వారిని నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించారు. ఎవరైనా క్షుద్రపూజలు, చేతబడి అంటే నమ్మవద్దని వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇలాంటి వారిపట్లు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. గుడ్డిగా నమ్మి మోసపోవద్దని సూచించారు.
Neera Cafe: 15 ఏళ్ల లీజుకు నీరా కేఫ్.. చర్చనీయాంశమైన ప్రభుత్వ నిర్ణయం

Exit mobile version