NTV Telugu Site icon

Warangal: వరంగల్‌ కౌంటింగ్‌ కు సర్వం సిద్దం

Warangal

Warangal

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కౌంటింగ్ కు సర్వం సిద్ధం చేశారు అధికారులు. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్దు ఆవరణలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలిత పోస్టల్ బ్యాలెట్, హోం ఓటింగ్, సర్వీస్ ఓట్ల లెక్కింపు షురూ కానుంది. పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపు కోసం ప్రత్యేక హాల్ ఏర్పాటు చేశారు అధికారులు. వరంగల్ ఎంపీ బరిలో 42 మంది అభ్యర్థులు నిలిచారు. 68.86% శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం ఓటర్లు 18,24,466..కాగా.. నమోదైన ఓట్లు 12,56,301 కాగా.. ప్రతి టేబుల్ కు ఒక సూపర్వైజర్, ఒక అసిస్టెంట్, ఒక మైక్రో అబ్జర్వర్ లతో EVM కౌటింగ్ ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రం పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంటుంది. మూడంచల భద్రత నడుమ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామని సీపీ హెచ్చరికలు జారీ చేసింది. ముగ్గురు డిసిపి లు,10 ఎసిపి లు, 29 మంది సీఐలు, 400 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.