NTV Telugu Site icon

Bollaram President residence: నేటి నుంచి రాష్ట్రపతి నిలయం సందర్శనకు ఎంట్రీ

Bollaram President Residence

Bollaram President Residence

Bollaram President residence: హైదరాబాద్ బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ఉగాది ఉత్సవాల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, హోం మంత్రి మహమూద్ ఆలీ పాల్గొన్నారు. నేటి నుంచి రాష్ట్ర పతి నిలయంలోకి ప్రజలకు అనుమతించనున్నారు. వర్చువల్ గా ప్రారంభం చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఈ సందర్భంగా రాష్ట్ర పతి ద్రౌపది ముర్మ మాట్లాడారు. కిందటి నెలలో హైదరాబాద్ లోని రాష్ట్ర పతి నిలయంలో బస చేసే అవకాశం దొరికిందని అన్నారు. ఆసమయంలో అక్కడ వున్న ఫ్లోర అండ్ ఫో కోసం తెలుసుకొనే అవకాశం దొరికిందని తెలిపారు. వాటన్నింటిని ప్రజలు తెలుసుకోవాలని అనే ఆలోచనతో ప్రజలకు సందర్శనార్థం రాష్ట్రపతి నిలయం ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రపతి నిలయం చరిత్రకి సంబందించిన పూర్తి విషయాలు నాలేడ్జ్ గ్యాలరీలో లభిస్తాయని అన్నారు. రినోవెట్ చేసిన కిచన్ టన్నెల్ ను తెలంగాణ ట్రెడిషనల్ కళతో నిర్మించాం.గతం లో వున్న రాష్ట్రపతుల చేతుల మీదగా వివిధ గార్డెన్స్ ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు నా హయాంలో బుట్టర్ ఫ్లై., రాక్, నక్షత గార్డెన్స్, స్టెప్ వెల్స్, ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రజలు అందరూ రాష్ట్రపతి నిలయంని సందర్శించాలని పిలుపునిచ్చారు.

గవర్నర్ తమిళి సై మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. గతంలో కేవలం 15రోజులు మాత్రమే ప్రజలకు సందర్శనార్థం అనుమతించగా ఇప్పుడు 11నెలల పాటు ప్రజలకు అనుమతించనున్న రాష్ట్రపతి ముమ్ముకి కృతజ్ఞతలు తెలిపారు. కచ్చితంగా రాష్ట్రపతి నిలయం హైదరాబాదులోని ప్రత్యేకమైన టూరిస్ట్ అట్రాక్షన్స్ లో ఒకటిగా నిలుస్తుందని అన్నారు. రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించేందుకు ప్రజలు ఆన్లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని, ఆసక్తి ఉన్నవారు రాష్ట్రపతి నిలయంలో ఉన్న ఫ్లోరల్ కోసం అక్కడ ఉన్న స్కానర్లు స్కాన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. హైదరాబాదులోని టూరిస్ట్ అట్రాక్షన్స్ లో ప్రత్యేకమైనదిగా రాష్ట్రపతి నిలయం నిలుస్తుందని గవర్నర్ తమిళిసై అన్నారు.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ ప్రజలకు శోభకృతనామ సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి నిలయాన్ని 11 నెలల పాటు ప్రజలకు సందర్శనార్థం ప్రారంభించే నిర్ణయం తీసుకున్నందుకు సంతోషంగా ఉంది. ఉగాది పర్వదినాన ప్రారంభించుకోవడం గొప్ప విషయమన్నారు. రాష్ట్రపతి నిలయం హెరిటేజ్ బిల్డింగ్ అని పేర్కొన్నారు. ఢిల్లీలో ఉండే విధంగా మన హైదరాబాద్ రాష్ట్రపతి నిలయంలో ప్రధాన మంత్రులు, రాష్ట్రపతి నిలయంలో ఇన్ఫర్మేషన్ ఉండడం సంతోషమన్నారు. హైదరాబాద్ లో అనేక పర్యాటక కేంద్రాలు వున్నాయని అందులో ఒకటిగా రాష్ట్రపతి నిలయం చేరిందన్నారు. రాష్ట్రపతి, రాష్ట్ర కార్యకలాపాలు పట్ల ప్రజలకు అవగాహన కలిగించే విధంగా ఈ రకమైనటువంటి సందర్శనాలు చాలా ఉపయోగపడుతాయని అన్నారు. హైదరాబాద్ కి విజిట్ చేసే వారు కచ్చితంగా రాష్ట్ర పతి నిలయం విజిట్ చేయాలనీ కిషన్ రెడ్డి కోరుతున్నా అన్నారు.
Supreme Court: బిల్కిస్ బానో పిటిషన్‌పై ప్రత్యేక బెంచ్ ఏర్పాటుకు సుప్రీం అంగీకారం