Site icon NTV Telugu

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు.. రేపటి నుంచే ఈడీ విచారణ

సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది.. ఇప్పటికే ముగ్గురు నిందితుల స్టేట్‌మెంట్‌ రికార్డు చేసిన ఈడీ అధికారులు.. ఆ ముగ్గురు ఇచ్చిన సమాచారంతో 12 మంది టాలీవుడ్ నటీనటులకు నోటీసులు కూడా జారీ చేశారు.. ఇక, రేపటి నుంచి ఈ కేసులో ఈడీ విచారణ ప్రారంభం కానుంది… వరుసగా టాలీవుడ్‌ నటీనటులను విచారించనుంది ఈడీ.. ఆ తర్వాత మరికొందరుపై దృష్టిసారించే అవకాశం ఉందని చెబుతున్నారు.. అయితే, ఇప్పటికే ఈ కేసులో ఎక్సైజ్ శాఖ విచారించిన వారందరికీ నోటీసులు పంపే యోచనలో ఈడీ అధికారులు ఉన్నట్టుగా తెలుస్తోంది.. డ్రగ్స్ కేసులో గతంలో ఎక్సైజ్ అధికారులు విచారించిన 50 మందికి కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందంటున్నారు.

మొత్తం సంచలనం సృష్టించిన టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో 62 మందిని విచారించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం.. డ్రగ్స్ కేసులో హవాలా మనీ లాండరింగ్ ఫెమా ఉల్లంఘనలు జరిగినట్లుగా ఇప్పటికే గుర్తించిన ఈడీ.. డ్రగ్స్ కొరకు పెద్ద మొత్తంలో విదేశాలకు నిధులను మళ్లించినట్టుగా గుర్తించింది.. డ్రగ్స్ కొనుగోలు చేసి నిందితులకు హవాలా ద్వారా డబ్బులు తరలించినట్టున్నట్టుగా.. ఇప్పటికే ముగ్గురు నిందితుల నుంచి సేకరించిన సమాచారాన్ని బట్టి ఈడీ గుర్తించింది. దీంతో.. మొదట 12 మంది టాలీవుడ్‌ ప్రముఖులకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

Exit mobile version