NTV Telugu Site icon

Sabitha Indrareddy: పూర్తి సమాచారం వచ్చిన తర్వాత లఖిత మృతిపై మాట్లాడతా..!

Sabitha Indra Reddy

Sabitha Indra Reddy

Sabitha Indrareddy: బాసర ట్రిపుల్ ఐటీలో వరుస సంఘటనలు బాధాకరమని రాష్ర్ట విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని గ్రంథాలయం ఆవరణలో నూతనంగా నిర్మించిన రీడింగ్ రూంను ప్రారంభించారు. బాసరలో జరుగుతున్న విద్యార్థుల వరుస ఆత్మహత్యలు బాధాకరమని అన్నారు. మొన్న జరిగిన పీయూసీ మెదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని దీపిక మూత్రశాలలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటనపై కమిటీ వేశామని.. విచారణ కొనసాగుతోందని చెప్పారు. ఈ రోజు జరిగిన ఘటనలో ఇంకా పూర్తి సమాచారం లేదని అన్నారు. పూర్తి సమాచారం తెచ్చుకున్న తర్వాత మీడియా సమావేశం అన్ని విషయాలను వెల్లడిస్తామని తెలిపారు. ఏదిఏమైనా విద్యార్థులు సమన్వయం పాటించి ఆత్మహత్యలకు పాల్పడవద్దని సూచించారు. అయితే లిఖిత ఘటనపై ట్రిపుల్ ఐటీ విద్యార్థిని లిఖిత మృతిపై వీసీ వెంకటరమణ స్పందించారు. ప్రమాదవశాత్తు లిఖిత మృతి చెందినట్లు అన్నారు. లిఖిత ఫోన్ చూస్తుండగానే భవనంపై నుంచి జారిపడిందని చెప్పాడు. ప్రమాదంలో లిఖిత వీపు భాగం దెబ్బతిందని తెలిపారు. విద్యార్థుల మృతి బాధాకరమని వీసీ వెంకటరమణ అన్నారు. మరోవైపు ట్రిపుల్ ఐటీ వీసీ జిల్లా ఆస్పత్రికి చేరుకుని విద్యార్థి లిఖిత మృత దేహాన్ని పరిశీలించారు. అయితే ఆస్పత్రికి వచ్చిన వీసీని లఖిత కుటుంబ సభ్యులు నిలదీశారు. మీ నిర్లక్ష్యం వల్లే పిల్లలు చనిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో దీపిక అనే విద్యార్థిని మృతి చెందిన ఘటన మరవకముందే మరో విద్యార్థిని లిఖిత మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. బూర లిఖిత ఆర్జీయూకేటీ బాసరలో పియుసి ప్రథమ సంవత్సరం చదువుకుంటుంది. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో లిఖిత వసతి గృహం 4 వ అంతస్తు నుండి ప్రమాదవశాత్తు కిందికి జారి పడింది. దీంతో లిఖిత అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో అక్కడే వున్న వారు కొందరు సంస్థ యాజమాన్యానికి తెలుపగా హుటా హుటిన వచ్చిన అధికారులు లిఖితను క్యాంపస్ హెల్త్ సెంటర్లో ప్రధమ చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం భైంసా ఏరియా హాస్పిటల్ కి తరలించగా.. అనంతరం అక్కడి నుంచి నిర్మల్ ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు ధృవీకరించారు. మృతి చెందిన విద్యార్థిని స్వస్థలం సిద్ది పేట జిల్లా గజ్వెల్ గా తెలిపారు. లిఖిత మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయితే లిఖిత నాలుగో ఫ్లోర్‌ నుంచి కింద పడుతున్నప్పుడు ఏం జరిగిందో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

హాస్టల్ లోని నాల్గవ ఫ్లోర్ నుంచి ప్రమాదవసాత్తు విద్యార్థిని లిఖిత పడిపోయిందని వార్తలు వచ్చాయి. అయితే ఈ క్రమంలో అలిఖత కిందికి పడి పోతున్న క్రమంలో మూడవ ఫ్లోర్ వద్ద చిక్కుకుంది. లిఖిత వేలాడుతూ కాపాడండి అంటూ అరిచింది. దీంతో కాపాడండి అంటూ అరుపులు వినపడటంతో విద్యార్థినికులు భయాందోళనకు గురయ్యారు. ఎక్కడి నుంచి ఈ అరుపులు వస్తున్నాయె మెల్లగా బయటకు రాగా.. విద్యార్థినిలకు లిఖిత మూడో ఫ్లోర్‌ వేలాడుతూ కనిపించింది. విద్యార్థినులకు ఎలా కాపాడాలో ఏమీ అర్థంకాలేదు. లిఖిత కాపాడండి అని దీనంగా ఏడుస్తూ అరుస్తున్నా నిర్ఘాంతపోయి చూసారే తప్పా ఏమీ చేయలేకపోయారు మిగతా విద్యార్థినులు. మూడో ఫ్లోర్‌ రో చిక్కుకున్న లిఖిత అక్కడి నుంచి కిందికి పడిపోయింది. అక్కడ వున్న విద్యార్థినులు కళ్ళ ముందే లిఖిత కిందపడిపోవడంతో విద్యార్థినిలు అక్కడే వున్న సిబ్బందికి సమాచారం అందించారు. అయితే కింద పడ్డా లిఖిత నొప్పిగా ఉందంటూ బాధపడుతున్న ఎవరూ ఏమీ చేయలేక పోయారు. లిఖిత కింద పడిన తరువాత దాదాపు 20 నిమిషాలకు ట్రిపుల్ ఐటీ నుంచి అంబులెన్సు లో భైంసా కు తరలించారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. 20 నిమిషాల ముందే లిఖితకు వైద్యం అందించి ఉంటే లిఖిత బతికేదని విద్యార్థినులు చెబుతున్నారు. అసలు లిఖిత ఎందుకు నాలుగో ఫ్లోర్‌ వెళ్లిందో అర్థం కావడం లేదని అంటున్నారు.
Manipur Violence: మణిపూర్ లో అల్లర్లు.. మహిళా మంత్రి ఇంటికే నిప్పు..!

Show comments