NTV Telugu Site icon

Big Breaking: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు..

Brs Mla Mahipal Reddy

Brs Mla Mahipal Reddy

Big Breaking: ఈడీ సోదాల వ్యవహారం తెలంగాణలో మరోసారి చర్చనీయాంశంగా మారింది. పటాన్ చెరువు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. అదే సమయంలో ఆయన సోదరుడు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో గురువారం తెల్లవారుజాము నుంచి ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఇద్దరు సోదరులు మైనింగ్, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఇటీవల ఓ కేసులో గూడెం మధు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. నిజాంపేటలోని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లోనే కాకుండా.. నిజాంపేటలోని వారి బంధువుల ఇళ్లలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇంటితో పాటు 8 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యేకు సంబంధించిన సంతోష్ గ్రానైట్ కంపెనీలో తనిఖీలు చేపట్టారు.

Read also: Secunderabad Alpha Hotel: సికింద్రాబాద్‌లోని ఆల్ఫా హోటల్‌లో ఫుడ్ టాస్క్‌ఫోర్స్ దాడులు.. వెలుగులోకి అసలు నిజాలు..!( వీడియో)

లగ్గారం గ్రామ సమీపంలో ఉన్న కార్యాలయంలో కూడా సోదాలు చేపట్టారు. అక్రమ మైనింగ్ పైన ఇప్పటికే మధుసూదన్ రెడ్డి తోపాటు మైపాల్ రెడ్డి పై కేసు నమోదైన విషయం తెలిసిందే.. గతంలోని సంగారెడ్డి కలెక్టర్ అక్రమ మైనింగ్ లపై విచారణ కొనసాగుతుంది. ఆర్డిఓ నేతృత్వంలో జరిగిన విచారణలో అక్రమ మైనింగ్ గుర్తించారు. లగ్డారంలో నమోదైన కేసు ఆధారంగా సోదాలు చేస్తున్న ఈడీ అధికారులు వెల్లడించారు. పెద్ద ఎత్తున బినామీల పేర్లతోటి ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. బినామీ పేర్లతోటి మైనింగ్ వ్యాపారాలు చేస్తున్నట్టు గుర్తింపు. రియల్ ఎస్టేట్స్ వ్యాపారంలో బినామీ పేర్లతోటి పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.
Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌