NTV Telugu Site icon

టీఆర్ఎస్ ఎంపీ నామాకు ఈడీ సమన్లు…

టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావుకు ఈడీ స‌మ‌న్లు జారీ చేసింది.  ఈనెల 25 వ తేదీన విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని ఈడి స‌మ‌న్ల‌లో పేర్కొన్న‌ది.  బ్యాంకు రుణాలను వేరే సంస్థ‌ల‌కు మ‌ల్లించిన కేసులో నామా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు.  ఈ కేసులోనే ఈడీ ఇటీవ‌లే నామా ఇంటిపైన‌, కార్యాల‌యాల‌పైన దాడులు చేశారు.  రెండు రోజుల‌పాటు మధుకాన్ గ్రూప్ డైరెక్ట‌ర్ల ఇళ్ల‌ల్లో ఈడీ సోదాలు నిర్వ‌హించింది.  ఈ సోదాల్లో భారీగా ద‌స్త్రాలు, ల‌క్ష‌ల రూపాయ‌ల న‌గ‌దును ఈడీ స్వాదీనం చేసుకున్న‌ది.  స్వాదీనం చేసుకున్న ద‌స్త్రాలు, ఖాతాలు, హ‌ర్డ్ డిస్క్‌ల‌ను ఈడీ అధికారులు విశ్లేషిస్తున్నారు.  

Show comments