అక్రమంగా ఇంటి ఆవరణలో ప్రభుత్వం నిషేధించిన గంజాయి చెట్లు పెంచుతున్న వాటిని స్వాధీనం చేసుకున్ని కేసులు నమోదు చేసారు దుబ్బాక పోలీసులు. ఈరోజు దుబ్బాక పోలీస్ స్టేషన్ పరిధిలోని హబ్సీపూర్ గ్రామంలో 1. బట్టు మల్లారెడ్డి, 2. బాలెంల శ్రీనివాస్ రెడ్డి ఇరువురు ఇంటి ఆవరణలో ప్రభుత్వం నిషేధించిన గంజాయి చెట్లు పెంచుతున్నాడని నమ్మదగిన సమాచారం పై దుబ్బాక సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐ స్వామి, శిక్షణ ఎస్ఐ సురేష్, సిబ్బందితో కలసి వెళ్లి ఇరువురి ఇంటి ఆవరణలో తనిఖీలు నిర్వహించగా 6 గంజాయి చెట్లు మరియు బట్టు మల్లారెడ్డి ఇంటిలో 55 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. తదుపరి బాలెంల శ్రీనివాస్ రెడ్డి ఇంటిలో తనిఖీలు నిర్వహించగా 40 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ 16,000/- ఉంటుంది ఇద్దరిపై కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించిన దుబ్బాక పోలీసులు.
ఈ సందర్భంగా దుబ్బాక సీఐ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… యువత గంజాయి మత్తు పదార్థాలు బానిసలు కావద్దని మరియు దుబ్బాక సర్కిల్ పరిధిలో దుబ్బాక, భూంపల్లి, మిరుదొడ్డి పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రభుత్వం నిషేధించిన అక్రమంగా గంజాయి, గుట్కా తదితర చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తే కేసులు నమోదు జైలుకు పంపుతామని. మరియు పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని సిఐ హెచ్చరించారు. గంజాయి, గుట్కా ఎవరైనా గ్రామాలలో అమ్మిన, ఇతరుల వద్ద నుండి కొనుగోలు చేసిన, రవాణా చేసిన ఏదైనా సమాచారం ఉంటే డయల్ 100 కు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని మరియు నగదు పురస్కారం అందజేస్తామని తెలిపారు.
