NTV Telugu Site icon

Dr Vaishali Kidnap Case: ఎగ్జామ్‌ సెంటర్‌కు డాక్టర్‌ వైశాలి.. కిడ్నాప్‌ ఎపిసోడ్‌తో భారీ భద్రత

Dr. Vaishali1

Dr. Vaishali1

Dr Vaishali Kidnap Case: తెలంగాణలో సంచలనం కలిగించిన డాక్టర్ కిడ్నాప్ కేసు పోలీసులు ఛేధించిన విషయం తెలిసిందే. రంగారెడ్డి జిల్లాలోని ఆదిభట్లలో తన ఇంటి నుంచి డా. వైశాలి ఇంట్లో చొరబడిన నవీన్, గ్యాంగ్ దాడి నానా హంగామా చేసి, వైశాలిని కిడ్నాప్ చేశారు. దీంతో వైశాలి తల్లిడండ్రులు పోలీసులకు ఆశ్రయించడంతో కిడ్నాప్‌ కు గురైన డా. వైశాలి కథకు తెరదించారు. అయితే ఇవాళ డాక్టర్‌ వైశాలకి ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కావడంతో వైశాలిని ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రాయించేందుకు తీసుకెళ్లేందుకు పేరెంట్స్ సిద్దమయ్యారు. బేగంపేట్ లో ఎగ్జాం రాయించెందుకు తండ్రి తీస్కెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు వైశాలి ఐలెట్స్ ఎగ్జాo రాయనుంది. నిన్న రాత్రి తండ్రితో పోలీసులు మాట్లాడించారు. ప్రస్తుతం వైశాలి ఎక్కడ ఉందో బయటకు తెలియనియకుండా జాగ్రత్త పడుతున్నారు. నవీన్‌ గ్యాంగ్‌ మళ్లీ తన కూతురికి ఏహాని చేస్తుందో అని భయాందోళన నడుమ పరీక్ష రాసేందుకు తీసుకెళ్లనున్నారు. దీంతో పరీక్ష కేంద్రం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు ఏర్పాట్లు చేశారు. అయితే నిన్న కిడ్నీప్‌ కు గురై ఇవాల వైశాలి పరీక్ష రాసేందుకు హాజరు కానున్నడంతో సర్వత్రా ఉత్కంఠ మొదలైంది. వైశాలి సేఫ్‌గా పరీక్ష రానుందా? పరీక్ష కేంద్రం వద్ద మళ్లీ నిన్నటి లాగే కిడ్నాప్‌ కథ జరగనుందా? అనేది ప్రజల్లో ఆశక్తిగా మారింది.

Read also: Bombay High Court: కానిస్టేబుల్ పోస్టులకు ట్రాన్స్‌జెండర్లు దరఖాస్తు చేసుకోవచ్చు..

తెలంగాణలో సంచలనం కలిగించిన డాక్టర్ కిడ్నాప్ కథ నిన్నటితో కొలిక్కి వచ్చింది. ఆదిభట్ల కిడ్నాప్ కేసును చేధించారు పోలీసులు.. డాక్టర్ వైశాలిని కిడ్నాప్ చేసిన కిడ్నాపర్ ని పట్టుకున్న పోలీసులు. డాక్టర్ వైశాలిని రక్షించారు. నల్లగొండ జిల్లా మంచన్‌పల్లి దగ్గర డాక్టర్ వైశాలిని వదిలేసి వెళ్ళిపోయినట్లుగా గుర్తించారు. డాక్టర్ వైశాలి అంతకుముందు తల్లిదండ్రులకు ఫోన్ చేసిన సంగతి తెలిసిందే. నవీన్ గ్యాంగ్ దాడిలో గాయాల పాలైన శేఖర్ పలు వివరాలు వెల్లడించారు. దామోదర్ రెడ్డి ఇంటి ముందు నిలబడ్డ శేఖర్ పై దాడికి పాల్పడ్డ నవీన్ గ్యాంగ్ హంగామా చేశారు. శేఖర్ పై దాడి చేసి రాడ్లు కర్రలతో కాళ్లు విరగొట్టింది నవీన్ గ్యాంగ్. నవీన్ గ్యాంగ్ దాడిని ప్రతిఘటించాడు శేఖర్. మాస్కు, హెల్మెట్ ,ఒకే రంగు డ్రెస్ వేసుకొని వచ్చారు. శేఖర్. తార్, జిప్సీ, మిగతా వాహనాల్లో ఒక్కసారిగా వచ్చారు..నవీన్ తో పాటు అందరూ తాగే ఉన్నారు.వాళ్లతో పట్టే రాళ్లు కర్రలు రాడ్స్ తీసుకొని వచ్చారు.కార్ల నుంచి దిగుతూనే ఒకసారిగా రాళ్ల వర్షం కురిపించారు.దొరికిన వాళ్ళ పైన రాడ్లు కర్రలతో దాడికి పాల్పడ్డారు.సీసీ కెమెరాలతో పాటు సెల్ ఫోన్లని ధ్వంసం చేశారు. అక్కడ ఉన్న అందరు సెల్ఫోన్లని గుంజుకొని దాడికి పాల్పడ్డారని, వారిముందే వైశాలని కిడ్నాప్‌ చేశారని తెలిపిన విషయం తెలిసిందే.
Rajinikanth: రీరిలీజ్ లో కూడా తగ్గని సూపర్ స్టార్ మేనియా…