Site icon NTV Telugu

Dr Vaishali Kidnap Case Busted: డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసుని చేధించిన పోలీసులు

Kidnaped

Kidnaped

తెలంగాణలో సంచలనం కలిగించిన డాక్టర్ కిడ్నాప్ కథ కొలిక్కి వచ్చింది. ఆదిభట్ల కిడ్నాప్ కేసును చేధించారు పోలీసులు.. డాక్టర్ వైశాలిని కిడ్నాప్ చేసిన కిడ్నాపర్ ని పట్టుకున్న పోలీసులు. డాక్టర్ వైశాలిని రక్షించారు. నల్లగొండ జిల్లా మంచన్‌పల్లి దగ్గర డాక్టర్ వైశాలిని వదిలేసి వెళ్ళిపోయినట్లుగా గుర్తించారు. డాక్టర్ వైశాలి అంతకుముందు తల్లిదండ్రులకు ఫోన్ చేసిన సంగతి తెలిసిందే.

నవీన్ గ్యాంగ్ దాడిలో గాయాల పాలైన శేఖర్ పలు వివరాలు వెల్లడించారు. దామోదర్ రెడ్డి ఇంటి ముందు నిలబడ్డ శేఖర్ పై దాడికి పాల్పడ్డ నవీన్ గ్యాంగ్ హంగామా చేశారు. శేఖర్ పై దాడి చేసి రాడ్లు కర్రలతో కాళ్లు విరగొట్టింది నవీన్ గ్యాంగ్. నవీన్ గ్యాంగ్ దాడిని ప్రతిఘటించాడు శేఖర్. మాస్కు, హెల్మెట్ ,ఒకే రంగు డ్రెస్ వేసుకొని వచ్చారు.. శేఖర్. తార్, జిప్సీ, మిగతా వాహనాల్లో ఒక్కసారిగా వచ్చారు..నవీన్ తో పాటు అందరూ తాగే ఉన్నారు.వాళ్లతో పట్టే రాళ్లు కర్రలు రాడ్స్ తీసుకొని వచ్చారు.కార్ల నుంచి దిగుతూనే ఒకసారిగా రాళ్ల వర్షం కురిపించారు.దొరికిన వాళ్ళ పైన రాడ్లు కర్రలతో దాడికి పాల్పడ్డారు.సీసీ కెమెరాలతో పాటు సెల్ ఫోన్లని ధ్వంసం చేశారు. అక్కడ ఉన్న అందరు సెల్ఫోన్లని గుంజుకొని దాడికి పాల్పడ్డారు. అమ్మాయిని వైశాలిని మాముందే ఎత్తుకొని పారిపోయారని వివరించారు.

 

Exit mobile version