Doctorates To Shantha Sinha And Ampasayya Naveen: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం పాటుపడిన ప్రొఫెసర్ శాంతా సిన్హా, ప్రఖ్యాత తెలుగు నవల రచయిత అంపశయ్య నవీలన్‌లకు అరుదైన గౌరవం లభించింది. గీతం డీమ్డ్ విశ్వివిద్యాలయం వారికి గౌరవ డాక్టరేట్ పురస్కారాల్ని సత్కరించింది. ఈనెల 30వ నిర్వహించనున్న గీతం 13వ స్నాతకోత్సవంలో ఆ ఇద్దరికి గౌరవ డాక్టర్ ఆఫ్ లెటర్స్ (డీ. లిట్)ను ప్రదానం చేయనున్నారు. గీతం డీమ్డ్ యూనివర్సిటీ అడిషనల్ వైస్-ఛాన్సిలర్ ఈ విషయాన్ని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
గీతం విశ్వవిద్యాలయం ఛాన్సిలర్ ప్రొఫెసర్ వీరేందర్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన జరగనున్న ఈ స్నాతకోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానిక ముఖ్య అతిథిగా సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్ కే. నందికూరి.. స్నాతకోపన్యాసం చేయనున్నారు. ఈ ఈవెంట్‌లో గీతం అధ్యక్షుడు ఎం. శ్రీభరత్ కూడా పాల్గొంటారని తెలిపింది. ఈ స్నాతకోత్సవంలో మొత్తం 1346 మంది విద్యార్థులు పట్టాలు తీసుకోవడానికి అర్హత సాధించారని.. వారిలో బీఏ, ఎంఏ, బీబీఏ, బీకాం, ఎంబీఏ, బీఎస్సీ, ఎమ్మె్స్సీ, బీటెక్, ఎంటెక్, బీఫార్మసీ విద్యార్థులు ఉన్నారని వెల్లడించారు.
కాగా.. సామాజిక సేవికురాలు, సంఘ సంస్కర్త అయిన శాంతా సిన్హా బాల కార్మికులపై చేసిన కృషికి గాను రామన్ మెగస్సే, పద్మశ్రీ పురస్కారాల్ని అందుకున్నారు. 1981లో పేదలకు విద్యనందించే దృక్పథంతో ఎంవీ ఫౌండేషన్‌ను స్థాపించారు. ఆ తర్వాత 1991లో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం వీదిబాలలకు విద్యాబుద్ధులు చెప్పడం మొదలుపెట్టింది. అటు.. రచయిత అంపశయ్య నవీన్ 2004లో రాసిన కాలరేఖలు నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్‌ను అందుకున్నారు.
