Site icon NTV Telugu

Medico Preethi Case: మెడికో ప్రీతి మృతి కేసు.. ప్రధాన నిందితుడు సైఫ్‌కి కోర్టు బెయిల్

Medico Preethi Case

Medico Preethi Case

Medico Preethi Case: వరంగల్ లో సంచలనం సృష్టించిన ఎంజీఎంలో మెడికో ప్రీతి మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రీతి మృతి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్‌కు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 10,000 బాండ్ మరియు ఇద్దరు వ్యక్తిగత పూచీకత్తుపై నిందితుడు సైఫ్‌కు ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయమూర్తి సత్యేంద్ర బెయిల్ మంజూరు చేశారు. అయితే ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల మధ్య సంబంధిత అధికారి ఎదుట హాజరుకావాలని షరతులు విధించారు. ఛార్జ్ షీట్ దాఖలు చేసే తేదీలోగా లేదా 16 వారాల్లోగా విచారణ అధికారి ముందు హాజరు కావాలని నిందితుడు సీనియర్ విద్యార్థి సైఫ్‌ను కోర్టు ఆదేశించింది. అయితే ప్రీతి మృతి కేసులో సైఫ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కోర్టు మూడుసార్లు తిరస్కరించింది. తాజాగా బెయిల్ మంజూరు కావడంతో నిందితుడు సైఫ్ 56 రోజుల తర్వాత జైలు నుంచి విడుదల కానున్నారు. ఇవాల ఖమ్మం జైలు నుంచి సైఫ్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. సైఫ్ తరపు న్యాయవాదులు సంబంధిత పత్రాలను జైలు అధికారులకు సమర్పించగా, కోర్టు ఆర్డర్ కాపీ అందిన తర్వాత ఇవాల ఖమ్మం జైలు నుంచి విడుదల కానున్నారు.

Read also:  Tarun Chugh: రేవంత్ రెడ్డి పార్టీని వీడే టైమ్ దగ్గరలోనే ఉంది

అసలు ఏం జరిగింది..

గతేడాది డిసెంబరు 6 నుంచి మూడుసార్లు పీజీ అనస్తీషియా ఫస్టియర్‌ విద్యార్థి ప్రీతి, సీనియర్ సైఫ్కీ మధ్య విభేదాలు వచ్చాయి. సార్ అని పిలవాలని, కేస్ షీట్స్ చెక్ చేసి, తనకు తెలివి లేదని గ్రూప్ లో మెసేజ్ లు పెట్టాలని కండిషన్ పెట్టడం ప్రీతి తట్టుకోలేకపోయింది. ఏదైనా తప్పు చేస్తే గ్రూప్‌లోని మెసేజ్‌లపై కాకుండా హెచ్‌ఓడీకి ఫిర్యాదు చేయాలని ప్రీతీ తన సీనియర్ సైఫ్‌కి పదేపదే సూచించింది. అయినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో ర్యాగింగ్ కొనసాగింది. వేధింపులు పెరగడంతో ప్రీతి ఒత్తిడికి లోనైంది. ఫిబ్రవరి 18న సైఫ్ ప్రీతీతో వాట్సాప్ గ్రూప్‌లో చాట్ చేసి మరోసారి వేధించాడు. 20వ తేదీన సైఫ్ వేధింపులను ప్రీతీ తన తల్లిదండ్రులకు వివరించింది. విషయం మేనేజ్‌మెంట్‌కు చేరడంతో వారు ఫిబ్రవరి 21న సైఫ్, ప్రీతికి ఫోన్ చేసి విచారించారు. అయినా సైఫ్‌ తీరు మారకపోవడం, ప్రీతిని వేధించడంతో భరించని ప్రీతి 22న హానికరమైన ఇంజక్షన్ వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే ఇది ఆత్మహత్యాయత్నం కాదని, ప్రీతికి బలవంతంగా విషం ఎక్కించారని ప్రీతి తండ్రి, సోదరుడు సంచలన ఆరోపణలు చేశారు. మృతదేహాన్ని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. కూతురు బ్రెయిన్ డెడ్ అయిందని, బతికే అవకాశం లేదన్నారు. ఫిబ్రవరి 26వ తేదీ రాత్రి ప్రీతికి బ్రెయిన్ డెడ్ కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. కాగా.. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న డాక్టర్ సైఫ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు పంపారు. అయితే.. ఇప్పుడు అతడికి కోర్టు బెయిలు మంజూరు చేసింది.
Tpcc Protest event: ఈ నెల 21న జరగాల్సిన నిరుద్యోగ సభ రద్దు.. టీపీసీసీ ప్రకటన

Exit mobile version